Cheepurupalli: ఎన్నికలకు సమాయత్తం కావాలి: చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు

Cheepurupalli: రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు పిలుపునిచ్చారు.

G SIMHACHALAM,	CHIPURPALLY
Published on: 5 Sept 2026 9:34 PM IST
Cheepurupalli
X

Cheepurupalli: ఎన్నికలకు సమాయత్తం కావాలి: చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు

చీపురుపల్లి: రాబోయే ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు పార్టీ శ్రేణులను పూర్తి స్థాయిలో సన్నద్ధం చేయాలని, ప్రతి గ్రామంలో పార్టీని మరింత బలోపేతం చేస్తూ ప్రజలకు మరింత చేరువ కావాలని చీపురుపల్లి ఎమ్మెల్యే శ్రీ కిమిడి కళా వెంకట్రావు గారు పిలుపునిచ్చారు.

చీపురుపల్లి క్యాంప్ కార్యాలయంలో పార్టీ క్యాడర్‌తో నిర్వహించిన సమావేశంలో రాబోయే ఎన్నికల కార్యాచరణ, గ్రామాల వారీగా పార్టీ పరిస్థితి, కార్యకర్తల సమన్వయం, డోర్ టు డోర్ కార్యక్రమం తదితర అంశాలపై ఆయన సమగ్రంగా సమీక్ష నిర్వహించారు.

రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటి నుంచే గ్రామస్థాయి నుంచి పార్టీ కార్యక్రమాలను మరింత చురుగ్గా నిర్వహించాలని సూచించారు. ప్రతి కార్యకర్త పార్టీకి బలమైన సైనికుడిగా పనిచేస్తూ ప్రజలతో నిరంతరం మమేకం కావాలని తెలిపారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ఇంటింటికీ వెళ్లి ప్రజలతో నేరుగా మమేకం అవుతున్న డోర్ టు డోర్ కార్యక్రమం పురోగతిపై గ్రామాలు, బూత్‌ల వారీగా అడిగి తెలుసుకుని, మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు పలు సూచనలు చేశారు.

ప్రజలే కేంద్రంగా, పార్టీ బలోపేతమే లక్ష్యంగా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రతి కుటుంబానికి చేరేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలన్నారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేసి చీపురుపల్లి నియోజకవర్గంలో పార్టీకి మరింత బలమైన పునాది వేయాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో పార్టీ ముఖ్య నాయకులు, మండలాల నాయకులు, గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

G SIMHACHALAM,	CHIPURPALLY

G SIMHACHALAM, CHIPURPALLY

Next Story