Vizianagaram: త్వరలోనే నిధుల విడుదల ఎమ్మెల్యే కిమిడికి ముఖ్యమంత్రి హామీ

Vizianagaram: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్వహించిన విజయనగరం జిల్లా సమీక్షలో ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు పాల్గొన్నారు.

G SIMHACHALAM,	CHIPURPALLY
Published on: 9 April 2026 12:54 PM IST
Vizianagaram
X

Vizianagaram: త్వరలోనే నిధుల విడుదల ఎమ్మెల్యే కిమిడికి ముఖ్యమంత్రి హామీ

విజయనగరం జిల్లా: చీపురుపల్లి నియోజకవర్గం, అమరావతిలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు నిర్వహించిన విజయనగరం జిల్లా ప్రజా ప్రతినిధుల సమీక్షా సమావేశంలో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి మరియు చీపురుపల్లి ఎమ్మెల్యే శ్రీ కిమిడి కళావెంకటరావు పాల్గొన్నారు.

సీఎం సమీక్షలో పాల్గొన్న ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు.

నియోజకవర్గ దీర్ఘకాలిక సమస్యలు, సాగునీటి ప్రాజెక్టులపై చర్చ.

3 ఆర్థికేతర, 3 నిధులతో కూడిన సమస్యల వివరణ.

100 పడకల హాస్పిటల్, తోటపల్లి కాలువ పనులపై వినతి.

RECS బలోపేతం, వెటర్నరీ కాలేజీ అభివృద్ధిపై ప్రస్తావన.

జలజీవన్ మిషన్ ద్వారా తాగునీటి సరఫరాపై చర్చ.

ఎమ్మెల్యే పనితీరుపై ముఖ్యమంత్రి ప్రశంసలు.

పెండింగ్ పనులకు త్వరలో నిధుల విడుదల.

అమరావతిలో గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు నిన్న సాయంత్రం విజయనగరం జిల్లా ప్రజా ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి నియోజకవర్గంలో దీర్ఘకాలంగా ఉన్న సమస్యలు, సాగునీటి వనరుల నిర్వహణ మరియు జిల్లా అభివృద్ధి ప్రతిపాదనలపై అందరు ఎమ్మెల్యేలతో చర్చించారు.

ప్రధానంగా ప్రతి ఎమ్మెల్యే తన నియోజకవర్గ పరిధిలో ఆర్థిక భారం లేని మూడు సమస్యలు మరియు నిధులతో ముడిపడిన మూడు సమస్యలను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లారు. సాగునీటి ప్రాజెక్టుల మరమ్మత్తులు, శిథిలావస్థకు చేరిన ప్రాజెక్టుల పై ముఖ్యమంత్రి గారు ఆరా తీశారు.

చీపురుపల్లి నియోజకవర్గానికి సంబంధించి 100 పడకల హాస్పిటల్ అభివృద్ధి, RECS సమస్యలు, తోటపల్లి కాలువ పనులు, వెటర్నరీ కాలేజీ అభివృద్ధి మరియు జలజీవన్ మిషన్ వంటి పలు కీలక అంశాలను శ్రీ కిమిడి కళావెంకటరావు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లారు. ఎమ్మెల్యే గారి పనితీరు బాగుందని, నియోజకవర్గ అభివృద్ధిపై మరింత శ్రద్ధ వహించాలని ముఖ్యమంత్రి సూచించారు.

ఈ సమావేశం ద్వారా నియోజకవర్గంలో పెండింగులో ఉన్న పనులకు, ముఖ్యమైన ప్రాజెక్టులకు త్వరలోనే ఊరట లభించే అవకాశం ఉందని ఎమ్మెల్యే శ్రీ కిమిడి కళావెంకటరావు తెలిపారు.

G SIMHACHALAM,	CHIPURPALLY

G SIMHACHALAM, CHIPURPALLY

Next Story