Parvathipuram: పాత్రుడు చెరువు సుందరీకరణకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే!
Parvathipuram: పార్వతీపురం జగన్నాధపురం పాత్రుడు చెరువు సుందరీకరణ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర.
Parvathipuram: పాత్రుడు చెరువు సుందరీకరణకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే!
Parvathipuram: ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలనే లక్ష్యంతో పార్వతిపురం మున్సిపాలిటీ పరిధిలోని జగన్నాధపురం పాత్రుడు చెరువు సుందరీకరణ పనులకు ఎమ్మెల్యే శ్రీ బోనెల విజయ్ చంద్ర శనివారం శ్రీకారం చుట్టారు. ఈ చెరువు పరిధి 1, 2, 29, 30 వార్డుల ప్రజలకు ఉపయోగపడేలా అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు. ఇటీవల చెరువు పరిసరాల్లో చెత్త, ముళ్లపొదలు పేరుకుపోవడంతో స్థానిక ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, వెంటనే స్పందించిన ఆయన సంబంధిత అధికారులతో కలిసి స్థలాన్ని పరిశీలించారు.
అనంతరం స్థానిక ప్రజలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో జంగిల్ క్లియరెన్స్ పనులను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, త్రినాథ స్వామి ఆలయం వెనుక భాగంలో ఉన్న ఎల్ (L) ఆకారపు చెరువుగట్టును పూర్తిగా శుభ్రపరిచి ఆధునిక వాకింగ్ ట్రాక్‌గా అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రజలు వాకింగ్, వ్యాయామం చేసుకునేందుకు అనువైన వాతావరణాన్ని కల్పిస్తామని తెలిపారు.చెరువుగట్టుపై ఎలాంటి అక్రమ ఆక్రమణలు జరగకుండా టౌన్ ప్లానింగ్ శాఖ అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే నివాస గృహాల నుంచి వచ్చే వ్యర్థ జలాలు చెరువులోకి చేరకుండా ప్రత్యామ్నాయ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
పార్వతిపురం పట్టణాన్ని మరింత పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజల సహకారంతో పట్టణ అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తామని ఆయన తెలిపారు.




