Salur: కోడికరకవలసలో ‘ఇంటింటికీ కూటమి సంక్షేమ విజయాలు’!
Salur: పార్వతీపురం మన్యం జిల్లా కోడికరకవలసలో 'ఇంటింటికీ కూటమి సంక్షేమ విజయాలు' కార్యక్రమంలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొని ప్రచారం నిర్వహించారు.
Salur: కోడికరకవలసలో ‘ఇంటింటికీ కూటమి సంక్షేమ విజయాలు’!
Salur: సాలూరు మండలం ఖరాసువలస పంచాయతీ కోడికరకవలస గ్రామంలో ఇంటింటికీ కూటమి ప్రభుత్వం సంక్షేమ విజయాలు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి
గ్రామానికి చేరుకున్న మంత్రి సంధ్యారాణి కి నాయకులు, ప్రజలు స్వాగతం పలికారు.
గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించిన మంత్రి ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు, ప్రభుత్వ సేవలపై అవగాహన కల్పించారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల వివరాలతో కూడిన కరపత్రాలను ప్రతి ఇంటికి పంపిణీ చేశారు.
ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి సంధ్యారాణి తెలిపారు.
పారదర్శక పాలనతో ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ప్రతి కుటుంబానికి చేరేలా కృషి చేస్తున్నామని వెల్లడించారు.
రాష్ట్ర అభివృద్ధి, పట్టణాలు–గ్రామాల పురోగతికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు రైతులు, మహిళలు, యువత, విద్యార్థుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.




