Merakamudidam: మెరకముడిదాంలో రూ. 4.89 లక్షల సీఎమ్‌ఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ

Merakamudidam: మెరకముడిదాం మండలంలో 9 మంది లబ్ధిదారులకు రూ.4,89,598 విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను టీడీపీ నేత కిమిడి రామ్ మల్లిక్ నాయుడు అందజేశారు.

G SIMHACHALAM,	CHIPURPALLY
Published on: 26 Aug 2026 6:09 PM IST
Merakamudidam
X

Merakamudidam: మెరకముడిదాంలో రూ. 4.89 లక్షల సీఎమ్‌ఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ

మెరకముడిదాం: ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా మంజూరైన చెక్కులను మెరకముడిదాం మండలంలో 9 మంది లబ్ధిదారులకు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కిమిడి రామ్ మల్లిక్ నాయుడు స్వయంగా వారి ఇళ్లకు వెళ్లి అందజేశారు. మొత్తం రూ.4,89,598 విలువైన చెక్కులను పంపిణీ చేశారు.

లబ్ధిదారుల వివరాలు:

బుదరాయవలసలో: సారిడి వెంకటి (రూ.28,795), సిర్లీ దుర్గారావు (రూ.71,369), చింతలూరి మురళీ మోహన్ రావు (రూ.69,610), బొద్దూరు బ్రహ్మజీ (రూ.1,02,786)

ఊటపల్లిలో: మండల పద్మ (రూ.23,920)

గర్భం గ్రామంలో: ధోడిగల్ల రాంబాబు (రూ.78,646), బూటు సీతారాములు కుటుంబం (రూ.49,879), మంత్రి చంద్రరావు (రూ.42,312)

చిన్నబంటుపల్లిలో: మన్నేపురి సూర్యనారాయణ (రూ.22,281)

ఈ సందర్భంగా కిమిడి రామ్ మల్లిక్ నాయుడు మాట్లాడుతూ, అనారోగ్యం, వైద్య ఖర్చులతో ఇబ్బంది పడుతున్న కుటుంబాలకు CMRF ఎంతో అండగా ఉంటుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. చెక్కులు ఇంటికే వచ్చి ఇచ్చినందుకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.

G SIMHACHALAM,	CHIPURPALLY

G SIMHACHALAM, CHIPURPALLY

Next Story