Vizianagaram: మానసస్ ట్రస్ట్ మెమోరియల్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు

Vizianagaram: మహారాజా అలక నారాయణ గజపతి రాజు జన్మదినం సందర్భంగా మానసస్ ట్రస్ట్ 2025-26 విద్యా సంవత్సరంలో ప్రతిభ చూపిన విద్యార్థులకు రూ. 5 లక్షల స్కాలర్‌షిప్‌లు అందజేసింది.

SHIVA, BHIMILI
Published on: 26 Aug 2026 4:19 PM IST
Vizianagaram
X

Vizianagaram: మానసస్ ట్రస్ట్ మెమోరియల్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు

విజయనగరం: మహారాజా అలక నారాయణ గజపతి రాజు గారి జన్మదినం సందర్భంగా మానస ట్రస్ట్ మెమోరియల్ సంస్థ వారు 2025-26 విద్యా సంవత్సరంకి గాను మంచి ఫలితాలు సాధించిన 10th, ఇంటర్ విద్యార్థిని, విద్యార్థులకు విజయనగరంలో 5,00,000 లక్షలు స్కాలర్షిప్ అందజేశారు.

వీరిలో విశాఖ జిల్లా లో 3 కేజీబీవీలలో చదువుతున్న విద్యార్థినులకు మొత్తం 2 లక్షల 80 వేలు స్కాలర్షిప్ అందజేశారు. వీరిలో భీమిలి KGBV లో చదివిన 10 వ తరగతి విద్యార్థినులు 11 మంది కి మరియు ఇంటర్ 7 గురికి ఒక్కొక్కరికి 5,000 వేలు చొప్పున స్కాలర్షిప్ అందజేశారు.

ఈ అవకాశం సమగ్ర శిక్షా APC డాక్టర్ J చంద్ర శేఖర్ రావు గారి ద్వారా రావడం, ఆయన సమక్షంలోనే స్కాలర్షిప్ స్టూడెంట్స్ అందుకోవడం ఆనందంగా ఉందని విద్యాలయం ప్రిన్సిపాల్ శ్రీమతి గంగా కుమారి గారు తెలియజేశారు. విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు సంతోషం వ్యక్త పరిచారు.

SHIVA, BHIMILI

SHIVA, BHIMILI

Next Story