Kurupam: కురుపాంలో పహలే ఇండియా సామర్థ్యాభివృద్ధి శిక్షణ

Kurupam: కురుపాం ఎంపీడీవో కార్యాలయంలో ఘనంగా పహలే ఇండియా సామర్థ్యాభివృద్ధి శిక్షణ. హాజరైన జేడీ వెంకటరావు, ఎస్‌డీసీ ధర్మరాజు మరియు అధికారులు.

V.SESHU	, KURUPAM
Published on: 24 July 2026 6:45 PM IST
Kurupam
X

Kurupam: కురుపాంలో పహలే ఇండియా సామర్థ్యాభివృద్ధి శిక్షణ

కురుపాం: కురుపాం నియోజకవర్గ కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం పహలే ఇండియా (PAHLE India) సామర్థ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి ప్రణాళిక (GDDP), మండల అభివృద్ధి ప్రణాళిక (GMDP), కీలక పనితీరు సూచికలు (KPI) అంశాలపై సమగ్ర శిక్షణ అందించారు.

కేంద్ర బృందం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి అమరావతి ప్రణాళిక శాఖ సంయుక్త సంచాలకులు (జాయింట్ డైరెక్టర్) వి. వెంకటరావు ముఖ్య అతిథిగా హాజరై అధికారులకు పలు సూచనలు చేశారు. అలాగే నియోజకవర్గ ప్రత్యేక అధికారి (ఎస్‌డీసీ) డి. ధర్మరాజు పాల్గొన్నారు.

నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు, డిప్యూటీ ఎంపీడీవోలు, మండల స్థాయి అధికారులు ఈ శిక్షణలో పాల్గొని ప్రణాళికల రూపకల్పన, అమలు విధానాలపై అవగాహన పెంపొందించుకున్నారు.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, గ్రామ మరియు మండల స్థాయిలో అభివృద్ధి ప్రణాళికల సమర్థ అమలుకు ఈ శిక్షణ ఎంతో ఉపయోగకరంగా నిలిచిందని తెలిపారు. ప్రభుత్వ పథకాల అమలులో పనితీరును మెరుగుపర్చేందుకు, లక్ష్యాలను సమర్థవంతంగా చేరుకునేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని పేర్కొన్నారు.

శిక్షణ కార్యక్రమం ద్వారా అధికారులకు జీడీడీపీ, జీఎండీపీ, కేపీఐల అమలు విధానాలపై స్పష్టత లభించడంతో పాటు, వారి రోజువారీ పరిపాలనా కార్యకలాపాలకు ఎంతో ఉపయుక్తంగా మారిందని నిర్వాహకులు తెలిపారు.

V.SESHU	, KURUPAM

V.SESHU , KURUPAM

Next Story