Kurupam: నీలకంఠాపురంలో అక్రమ బెల్ట్ షాపుపై దాడి!

Kurupam: మన్యం జిల్లా కురుపాం మండలం నీలకంఠాపురం శివారులో బెల్ట్ షాపుపై దాడి. 6 మద్యం సీసాలు స్వాధీనం. ఎస్ఐ రమేష్ నాయుడు కేసు నమోదు.

V.SESHU	, KURUPAM
Published on: 17 July 2026 5:01 PM IST
Kurupam
X

Kurupam: నీలకంఠాపురంలో అక్రమ బెల్ట్ షాపుపై దాడి!

Kurupam: పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం నీలకంఠాపురం గ్రామ శివారులో అక్రమంగా నిర్వహిస్తున్న బెల్ట్ షాపుపై నీలకంఠాపురం ఎస్‌ఐ రమేష్ నాయుడు ఆధ్వర్యంలో పోలీసులు దాడి నిర్వహించారు. ఈ సందర్భంగా 180 మిల్లీలీటర్ల సామర్థ్యం గల 6 ఐఎంఎఫ్ఎల్ (IMFL) మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.

అక్రమ మద్యం విక్రయాలపై అందిన సమాచారం మేరకు ఎస్‌ఐ రమేష్ నాయుడు ప్రత్యేక బృందంతో తనిఖీలు చేపట్టగా బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న వ్యక్తి వద్ద మద్యం సీసాలు గుర్తించినట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న మద్యం సీసాల ఆధారంగా ఆకరెన్స్ రిపోర్టు నమోదు చేసి, Cr.No.26/2026గా ఏపీ ఎక్సైజ్ చట్టం సెక్షన్ 34(A) కింద కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రమేష్ నాయుడు వెల్లడించారు.

అక్రమ మద్యం విక్రయాలు, బెల్ట్ షాపుల నిర్వహణపై ఎలాంటి రాజీ లేకుండా చర్యలు కొనసాగుతాయని ఆయన హెచ్చరించారు. గ్రామాల్లో బెల్ట్ షాపులు, చట్టవిరుద్ధ మద్యం విక్రయాలపై ప్రజలు సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఎస్‌ఐ రమేష్ నాయుడు తెలిపారు. ప్రజల సహకారంతో అక్రమ మద్యం నిర్మూలనకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నామని ఆయన పేర్కొన్నారు.

V.SESHU	, KURUPAM

V.SESHU , KURUPAM

Next Story