Kurupam: కురుపాంలో రూ.3 కోట్ల వ్యయంతో 50 పడకల సీహెచ్‌సీ ప్రారంభం!

Kurupam: కురుపాంలో రూ.3 కోట్లతో నిర్మించిన 50 పడకల సీహెచ్‌సీని మంత్రి అచ్చెన్నాయుడు ప్రారంభించి, రోగులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.

V.SESHU	, KURUPAM
Published on: 9 Aug 2026 10:09 AM IST
Kurupam
X

Kurupam: కురుపాంలో రూ.3 కోట్ల వ్యయంతో 50 పడకల సీహెచ్‌సీ ప్రారంభం!

గిరిజన ప్రాంత ప్రజల వైద్య సేవల్లో నూతన శకం

కురుపాంలో రూ. 3 కోట్ల వ్యయంతో 50 పడకల సీహెచ్సీ ప్రారంభం!

ఆహ్లాదకర వాతావరణంలో ఆసుపత్రి ఉండాలి

రోగులకు మెరుగైన వైద్యంతో పాటు సమయపాలన పాటించాలని హితవు

రాష్ట్ర వ్యవసాయ, జిల్లా ఇంఛార్జ్ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

కురుపాం , ఆగస్టు 8 : మూరుమూల గిరిజన ప్రాంతమైన కురుపాంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా 50 పడకల నూతన కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (CHC) భవన ప్రారంభోత్సవం శనివారం ఘనంగా జరిగింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి మరియు జిల్లా ఇంఛార్జ్ మంత్రివర్యులు కింజరాపు అచ్చెన్నాయుడు ఈ నూతన భవనాన్ని ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, కురుపాం శాసన సభ్యులు తోయక జగదీశ్వరి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం

మంత్రి ఆసుపత్రిలోని నూతన సదుపాయాలను పరిశీలించి, వైద్య సిబ్బంది, అధికారులతో మాట్లాడి పలు కీలక సూచనలు చేశారు. కేవలం ఒక డాక్టర్, ఒక స్టాఫ్ నర్స్‌తో అప్‌గ్రేడెడ్ పబ్లిక్ హెల్త్ సెంటర్‌గా (UPHC) ప్రారంభమైన ఈ ఆసుపత్రి,, నేడు రూ. 3.00 కోట్ల వ్యయంతో 50 పడకల ఆధునిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌గా ఆవిర్భవించిందన్నారు. మారుమూల ప్రాంతాల నుంచి వచ్చే గిరిజనులు, పేదలు, గర్భిణులు, అత్యవసర బాధితులకు వైద్యులు, సిబ్బంది కుటుంబ సభ్యుల్లా భావించి గౌరవప్రదంగా, నాణ్యమైన వైద్య సేవలు అందించాలని మంత్రి సూచించారు. అలాగే వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని, ఎల్లపుడు ఆహ్లాదకర వాతావరణంలో ఆసుపత్రి ఉండేలా చూడాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ ను మంత్రి ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో పాలకొండ శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ, జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి, ట్రైకార్ బోర్డు మెంబర్ పువ్వల లావణ్య, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. పి.విజయలక్ష్మీ, జిల్లా ఆసుపత్రుల సమన్వయకర్త డా. జి. నాగభూషణరావు, జిల్లా ప్రోగ్రాం మేనేజర్ డా. టి. జగన్మోహనరావు, ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ఇంజనీరింగ్ విభాగ సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

V.SESHU	, KURUPAM

V.SESHU , KURUPAM

Next Story