Kurupam: కురుపాం పాఠశాలకు రూ.2 లక్షల విలువైన ల్యాబ్ పరికరాలు

Kurupam: కురుపాం జెడ్పీ పాఠశాలకు రూ.2 లక్షల ల్యాబ్ పరికరాలను అందజేసిన విశాఖ మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్. దత్తత పాఠశాల అభివృద్ధిలో భాగంగా సహకారం.

V.SESHU	, KURUPAM
Published on: 15 July 2026 3:02 PM IST
Kurupam
X

Kurupam: కురుపాం పాఠశాలకు రూ.2 లక్షల విలువైన ల్యాబ్ పరికరాలు

కురుపాం: కమ్యూనిటీ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్) కార్యక్రమంలో భాగంగా విశాఖపట్నంకు చెందిన మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ కురుపాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు రూ.2 లక్షల విలువైన ప్రయోగశాల పరికరాలు, టేబుళ్లను అందజేసింది.

గత మూడు సంవత్సరాలుగా కురుపాం జెడ్పీ ఉన్నత పాఠశాలను దత్తత పాఠశాలగా స్వీకరించిన మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోంది. ఈ క్రమంలో హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ వూళ్ల మురళీకృష్ణ ప్రత్యేకంగా రూ.2 లక్షలు కేటాయించి ల్యాబ్ పరికరాల కొనుగోలుకు సహకరించారు.

బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో హాస్పిటల్ ప్రతినిధి జామి దేవి ప్రసాద్ ప్రయోగశాల పరికరాలు, టేబుళ్లను పాఠశాల ప్రధానోపాధ్యాయులు తోట శంకరరావుకు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా ఈ సహాయం అందిస్తున్నట్లు తెలిపారు.

అలాగే భవిష్యత్తులో కూడా పాఠశాల అభివృద్ధికి అవసరమైన సహకారం అందించేందుకు తన వంతు కృషి కొనసాగిస్తానని జామి దేవి ప్రసాద్ హామీ ఇచ్చారు. పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ ల్యాబ్ పరికరాల ద్వారా విద్యార్థులకు ప్రాయోగిక విద్య మరింత మెరుగ్గా అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు.

V.SESHU	, KURUPAM

V.SESHU , KURUPAM

Next Story