Vizianagaram: ప్రవాసాంధ్రుడిని స్వదేశానికి రప్పించేందుకు ప్రభుత్వం చొరవ
Vizianagaram: పోలాండ్‌లో అనారోగ్యంతో బాధపడుతున్న విజయనగరం జిల్లాకు చెందిన బోగి వెంకటరమణను స్వదేశానికి రప్పించేందుకు మంత్రి శ్రీనివాస్, ఎమ్మెల్యే బేబీ నాయన చొరవ తీసుకున్నారు.
Vizianagaram: ప్రవాసాంధ్రుడిని స్వదేశానికి రప్పించేందుకు ప్రభుత్వం చొరవ
Vizianagaram: విజయనగరం జిల్లా బాడంగి మండలం, రామచంద్రాపురం గ్రామానికి చెందిన బోగి వెంకటరమణ గారు పోలాండ్ దేశంలో వెల్డరుగా పనిచేయడానికి వెళ్లారు.. ఊపిరితిత్తులలో నీరు చేరడంతో చికిత్స నిమిత్తం పోలాండ్ ఆసుపత్రిలో చేరడం జరిగింది. ఆరోగ్య పరిస్థితి బలహీనం అవుతుండటంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.
ఈ విషయాన్ని ఎంపీటీసీ శివ బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్.వీ.ఎస్.కె.కె.రంగారావు (బేబీ నాయన) గారి దృష్టికి తెలియపరిచారు. శనివారం స్వయంగా ఎమ్మెల్యే బేబీ నాయన గారు రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారి వద్దకు భోగి వెంకటరమణ కుటుంబసభ్యులను తీసుకువచ్చి పరిస్థితిని వివరించి అతనిని స్వదేశానికి రప్పించడానికి ప్రభుత్వం తరుపున సహకరించాలని కోరారు. సానుకూలంగా స్పందించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు వెనువెంటనే ఎన్నార్టీ మరియు ఎంబసీ అధికారులతో




