Vizianagaram: వేద మంత్రాల సాక్షిగా అంజన్న క్షేత్రంలో భూమి పూజ.. పాల్గొన్న యువనేత!
Vizianagaram: విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం వంగపల్లి పేటలో శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయ నిర్మాణానికి కిమిడి రామ్ మాలిక్ నాయుడు శంకుస్థాపన చేశారు.
Vizianagaram: వేద మంత్రాల సాక్షిగా అంజన్న క్షేత్రంలో భూమి పూజ.. పాల్గొన్న యువనేత!
చీపురుపల్లి: మండల పరిధిలోని వంగపల్లి పేట గ్రామంలో నూతనంగా నిర్మించనున్న శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయ శంకుస్థాపన మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, యువనేత శ్రీ కిమిడి రామ్ మాలిక్ నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని, శాస్త్రోక్తంగా జరిగిన పూజా కార్యక్రమాల్లో భాగస్వాములయ్యారు.
గ్రామస్తులు మరియు ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు విచ్చేసిన రామ్ మాలిక్ నాయుడు కి గ్రామ పెద్దలు, మహిళలు ఘనస్వాగతం పలికారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఆయన ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా రామ్ మాలిక్ నాయుడు మాట్లాడుతూ:
గ్రామాల్లో ఆధ్యాత్మిక చింతన పెరగడం వల్ల ప్రశాంతత నెలకొంటుంది. అమ్మవారి ఆశీస్సులు వంగపల్లి పేట గ్రామ ప్రజలందరిపై ఉండి, అందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. ఆలయ నిర్మాణానికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని, గ్రామస్తులందరూ ఐకమత్యంతో ఈ నిర్మాణాన్ని పూర్తి చేయాలని" ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో స్థానిక టిడిపి నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు మరియు భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.




