Parvathipuram: బంగారమ్మపేటలో ‘ఇంటి ఇంటికీ మన్యం పోలీస్’!

Parvathipuram: పార్వతీపురం మన్యం జిల్లా బంగారమ్మపేటలో సాలూరు టౌన్ పోలీసులు 'ఇంటి ఇంటికీ మన్యం పోలీస్' కార్యక్రమం నిర్వహించారు.

B VENKATESH, SALURU
Published on: 24 Aug 2026 8:50 PM IST
Parvathipuram
X

Parvathipuram: బంగారమ్మపేటలో ‘ఇంటి ఇంటికీ మన్యం పోలీస్’!

పార్వతీపురం మన్యం జిల్లా: ఎస్పీ శ్రీ ఎస్.వి. మాధవ రెడ్డి, IPS పర్యవేక్షణలో, సాలూరు టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో ఈ రోజు బంగారమ్మపేట గ్రామంలో “ఇంటి ఇంటికీ మన్యం పోలీస్” కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలను నేరుగా కలిసి సైబర్ మోసాలు, మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలు, మహిళలు మరియు చిన్నారుల రక్షణకు సంబంధించిన చట్టాలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు.

సైబర్ నేరగాళ్ల మోసాలకు గురికాకుండా అపరిచిత లింకులు, OTPలు, బ్యాంకు వివరాలు, వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులతో పంచుకోకూడదని ప్రజలకు సూచించారు. మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, వాటి వల్ల కలిగే సామాజిక మరియు వ్యక్తిగత నష్టాలపై అవగాహన కల్పించారు.

మహిళలు, చిన్నారులపై జరిగే నేరాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి సమస్య ఎదురైనా వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు. ప్రజల భద్రతే మా బాధ్యత – ప్రజలకు చేరువగా మన్యం పోలీసులు అనే లక్ష్యంతో ఎస్పీ పర్యవేక్షణలో ఇలాంటి అవగాహన కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తున్నట్లు సాలూరు టౌన్ పోలీసులు తెలిపారు.

B VENKATESH, SALURU

B VENKATESH, SALURU

Next Story