Gurla: గుర్ల పోలీస్ స్టేషన్‌లో మొక్కలు నాటే కార్యక్రమం

Gurla: విజయనగరం జిల్లా గుర్ల పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు ఎస్సై నారాయణ రావు ఆధ్వర్యంలో ఘనంగా మొక్కలు నాటే కార్యక్రమం.

G SIMHACHALAM,	CHIPURPALLY
Published on: 17 Aug 2026 8:11 PM IST
Gurla
X

Gurla: గుర్ల పోలీస్ స్టేషన్‌లో మొక్కలు నాటే కార్యక్రమం

గుర్ల: 2026 జిల్లా SP దామోదర్ గారి ఆదేశాల మేరకు భాగంగా ఈరోజు *గుర్ల పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది.

"స్వాతంత్రం వచ్చి 80 ఏళ్లు అవుతున్నా... మనకు శ్వాసనిచ్చే చెట్లను మనం కాపాడుకోగలిగామా?" అనే ప్రశ్నతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం.

ఇప్పలవలస గోపాలరావు సూచనలతో గుర్ల APO రత్నమాల గారి సహకారంతో కలవచర్ల కమిట్మెంట్ గ్రూప్ ఆధ్వర్యంలో, గుర్ల పోలీస్ స్టేషన్ సిబ్బంది తో కలిసి ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుర్ల SI పిసిని నారాయణ రావు గారితో హాజరై మొక్కలు నాటడం జరిగింది..

పోలీస్ స్టేషన్ ఆవరణలో వేప, మర్రి, రావి, కాము, నీలగిరి , పూల మొక్కలతో పాటు పండ్ల మొక్కలను కూడా నాటడం జరిగింది. ఇవి కేవలం మొక్కలు కాదు... రేపటి తరానికి మనం ఇచ్చే వరం.

ఎందుకు ఈ కార్యక్రమం?

1. పర్యావరణ పరిరక్షణ: పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించడానికి

2. స్వచ్ఛ భారత్: పోలీస్ స్టేషన్ ని ఆదర్శంగా, హరితంగా మార్చడానికి

3. ప్రజల్లో చైతన్యం: ప్రతి ఒక్కరూ ఇంటి దగ్గర కనీసం ఒక మొక్క నాటాలనే సందేశం ఇవ్వడానికి

పోలీస్ శాఖ వారు 24 గంటలు ప్రజల రక్షణ కోసం పని చేస్తారు. అదేవిధంగా మనం ప్రకృతిని రక్షించడం కూడా మన బాధ్యత. ఈ సందర్భంగా NVN బ్లడ్ బ్యాంకు నాగేశ్వరావు మరియు బెవర కూర్మారావు మాట్లాడుతూ... "చెట్టు నరికితే శిక్ష ఉంటుంది కానీ, చెట్టు నాటితే ప్రోత్సాహం ఉండాలి. ప్రతి ప్రభుత్వ కార్యాలయం ఆవరణ హరితంగా ఉంటేనే మన ఊరు బాగుపడుతుంది" అని తెలిపారు .

ఈ కార్యక్రమంలో గుర్ల పోలీస్ స్టేషన్ సిబ్బంది, కమిట్మెంట్ గ్రూప్ సభ్యులు, కెల్ల ఫీల్డ్ అసిస్టెంట్ రాంబాబు, TA తమ్మినాయుడు, లైబ్రరీ రామారావు గారు తదితరులు పాల్గొన్నారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించే బాధ్యత మనందరిదీ అని ఒప్పందం కూడా చేసుకున్నారు .

చివరగా ఒకటే మాట. "ఒక మొక్క నాటండి - ఒక జీవితాన్ని కాపాడండి". ప్రకృతిని కాపాడుకోవడమే నిజమైన దేశభక్తి. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.

G SIMHACHALAM,	CHIPURPALLY

G SIMHACHALAM, CHIPURPALLY

Next Story