Vizianagaram: రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం.. గుర్లలో ముమ్మర తనిఖీలు

Vizianagaram: విజయనగరం జిల్లా గుర్ల మండలంలో పోలీసులు ముమ్మర వాహన తనిఖీలు నిర్వహించారు. హెల్మెట్ ప్రాధాన్యతను వివరిస్తూ జరిమానాలు విధించారు.

G SIMHACHALAM,	CHIPURPALLY
Published on: 3 May 2026 5:22 PM IST
Vizianagaram
X

Vizianagaram: రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం.. గుర్లలో ముమ్మర తనిఖీలు

Vizianagaram: విజయనగరం జిల్లా గుర్ల మండలంలో రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో భాగంగా గుర్ల పోలీసులు ఆదివారం మండలంలోని ప్రధాన కూడళ్లు, జంక్షన్ల వద్ద ముమ్మరంగా నాకాబంది నిర్వహించి వాహన తనిఖీలు చేపట్టారు.

గుర్ల ఎస్ఐ నారాయణరావు ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది విజయనగరం-పాలకొండ రోడ్డు, మెయిన్ రోడ్డు, బస్టాండ్ సెంటర్ తదితర ప్రాంతాల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ద్విచక్ర వాహనదారుల హెల్మెట్లు, డ్రైవింగ్ లైసెన్సులు, వాహన రిజిస్ట్రేషన్ పత్రాలు, ఇన్సూరెన్స్ పరిశీలించారు. హెల్మెట్ లేకుండా వాహనం నడుపుతున్న వారికి జరిమానాలు విధించి, తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు.

రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ మరణాలు హెల్మెట్ లేకపోవడం వల్లే జరుగుతున్నాయి. మీ ప్రాణం మీ కుటుంబానికి విలువైనది. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించండి. మద్యం సేవించి వాహనాలు నడపవద్దు" అని ఎస్ఐ నారాయణరావు వాహనదారులకు వివరించారు.

అదేవిధంగా, మహిళల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన 'శక్తి యాప్' గురించి మహిళలకు, విద్యార్థినులకు అవగాహన కల్పించారు. ఈ యాప్‌ను మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకుని రిజిస్టర్ చేసుకోవాలని, ఆపద సమయంలో ఎస్ఓఎస్ బటన్ నొక్కితే వెంటనే డయల్ 100, సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం చేరుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని ఎస్ఐ తెలిపారు.

G SIMHACHALAM,	CHIPURPALLY

G SIMHACHALAM, CHIPURPALLY

Next Story