Gurla: కోటగండ్రేడులో విషాదం ప్రేమికుడి మృతితో యువతి ఆత్మహత్య

Gurla: విజయనగరం జిల్లా గుర్ల మండలం కోటగండ్రేడులో విషాదం. ప్రేమికుడు మృతి చెందడంతో మనస్తాపం చెంది యువతి ఆత్మహత్య. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

G SIMHACHALAM,	CHIPURPALLY
Published on: 18 Aug 2026 6:50 PM IST
Gurla
X

Gurla: కోటగండ్రేడులో విషాదం ప్రేమికుడి మృతితో యువతి ఆత్మహత్య

గుర్ల: విజయనగరం జిల్లా, గుర్ల మండలం కోటగండ్రేడు గ్రామంలో రెండు రోజుల్లో రెండవ విషాద ఘటన చోటుచేసుకుంది. తేదీ: 18.08.2026 న కోటగండ్రేడు గ్రామానికి చెందిన ముద్దాడ నందిని, వయస్సు 17 సంవత్సరాలు, D/o సూర్య నారాయణ అనే యువతి తన ఇంటిలో ఉరి వేసుకొని మృతి చెందింది.

మృతురాలి తల్లి ముద్దాడ లక్ష్మి W/o సూర్య నారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు, నందిని ప్రేమించిన అబ్బాయి దేవకినందన్ అదే రోజు మృతి చెందడంతో మనస్తాపం చెంది ఈ చర్యకు పాల్పడినట్లు తెలిపారు.

సమాచారం అందుకున్న వెంటనే గుర్ల పోలీస్ స్టేషన్ SI శ్రీ పి. నారాయణరావు గారు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతురాలి తల్లి ఫిర్యాదుపై గుర్ల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

వరుసగా ఒకే గ్రామంలో రెండు మరణాలు జరగడంతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు.

G SIMHACHALAM,	CHIPURPALLY

G SIMHACHALAM, CHIPURPALLY

Next Story