Gurla: గుర్ల మండలంలో వైసీపీకి షాక్ టీడీపీలో చేరిన 50 కుటుంబాలు!

Gurla: విజయనగరం జిల్లా గుర్ల మండలం ముద్దాడపేటలో వైసీపీకి షాక్. ఎమ్మెల్యే కళా వెంకటరావు సమక్షంలో టీడీపీలో చేరిన 50 కుటుంబాలు, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు.

G SIMHACHALAM,	CHIPURPALLY
Published on: 13 Sept 2026 2:02 PM IST
Gurla
X

Gurla: గుర్ల మండలంలో వైసీపీకి షాక్ టీడీపీలో చేరిన 50 కుటుంబాలు!

Gurla: విజయనగరం జిల్లా గుర్ల మండలం ముద్దాడపేట పంచాయతీలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. సుమారు 50 కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాయి. చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు సమక్షంలో ఈ చేరికలు జరిగాయి.

కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పనులు చూసి టీడీపీలో చేరుతున్నట్లు వారు తెలిపారు. చేరిన వారిలో ఇద్దరు వార్డు మెంబర్లు, వైస్ సర్పంచ్ ఉన్నారు. పళ్ళ రమణ (వార్డు మెంబర్), పళ్ళ గౌరీనాయుడు (5వ వార్డు మెంబర్ మరియు ఉప సర్పంచ్) టీడీపీ కండువా కప్పుకున్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సెల్ కార్యనిర్వాహక కార్యదర్శి, మాజీ ఎంపీపీ వెన్నె సన్యాసినాయుడు, మండల నాయకులు, గ్రామ స్థాయి నాయకులు, గ్రామ పెద్దలు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఎమ్మెల్యే కళా వెంకటరావు వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.

G SIMHACHALAM,	CHIPURPALLY

G SIMHACHALAM, CHIPURPALLY