Kurupam: గట్టు మీద చెట్టు – బంతి చామంతితో రైతులకు అదనపు ఆదాయం!

Kurupam: కురుపాం సీతంపేటలో "గట్టు మీద చెట్టు", "బంతి-చామంతి" కార్యక్రమాలు. పాల్గొన్న ప్రభుత్వ విప్ తోయిక జగదీశ్వరి, జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి.

V.SESHU	, KURUPAM
Published on: 13 Aug 2026 3:32 PM IST
Kurupam
X

Kurupam: గట్టు మీద చెట్టు – బంతి చామంతితో రైతులకు అదనపు ఆదాయం!

Kurupam: రైతులు పొలం గట్లను సద్వినియోగం చేసుకుని అదనపు ఆదాయం పొందేలా "గట్టు మీద చెట్టు", "బంతి–చామంతి" కార్యక్రమాలను విస్తృతంగా అమలు చేయాలని ప్రభుత్వ విప్ తోయిక జగదీశ్వరి, జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డితో కలసి గురువారం కురుపాం మండలం సీతంపేట గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో. పాల్గొన్నారు.

ప్రభుత్వ విప్ మాట్లాడుతూ వ్యవసాయంలో వినూత్న పద్ధతులను అవలంబించడం ద్వారా రైతులు ఆదాయాన్ని పెంచుకోవడంతో పాటు పంటల సంరక్షణను మెరుగుపరుచుకోవచ్చని వారు తెలిపారు. "గట్టు మీద చెట్టు" కార్యక్రమంలో భాగంగా పొలం గట్లపై కొబ్బరి, జామ, ఉసిరి, మునగ వంటి పండ్ల, కూరగాయల మొక్కలను నాటించారు.

వ్యవసాయ భూమిలో గట్లు ఖాళీగా ఉండకుండా వాటిని ఉత్పాదకంగా వినియోగించడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం సమకూరుతుందని పేర్కొన్నారు. అలాగే పచ్చదనం పెంపొందడం, భూసార పరిరక్షణ, పర్యావరణ సంరక్షణకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని వివరించారు.

జిల్లా కలెక్టర్ "బంతి–చామంతి" కార్యక్రమం కింద రైతులకు బంతి, చామంతి మొక్కలను పంపిణీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ పొలం గట్లపై బంతి మొక్కలను పెంచడం వల్ల పంటలకు హాని చేసే చీడపీడల ఉధృతి తగ్గుతుందని, సహజసిద్ధ పద్ధతుల్లో పురుగుల నియంత్రణ సాధ్యమవుతుందని తెలిపారు. దీంతో రసాయనిక పురుగుమందుల వినియోగం తగ్గి సాగు వ్యయం కూడా తగ్గే అవకాశం ఉంటుందని చెప్పారు.

రైతులు ఈ కార్యక్రమాలను ప్రతి గ్రామంలో విస్తృతంగా అమలు చేసి వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చుకోవాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి, ప్రభుత్వ విప్ పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి టి భవానీ శంకర్,వైరిచర్ల వీరేష్ చంద్రదేవ్, డొంకాడ రామకృష్ణ,స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.

V.SESHU	, KURUPAM

V.SESHU , KURUPAM

Next Story