Cheepurupalli: గరివిడి గ్రంథాలయంలో ఘనంగా డాక్టర్ ఎస్.ఆర్. రంగనాథన్ జయంతి
Cheepurupalli: చీపురుపల్లి నియోజకవర్గం గరివిడి శాఖా గ్రంథాలయంలో గ్రంథాలయ పితామహుడు డాక్టర్ సియాలి రామమృత రంగనాథన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.
Cheepurupalli: గరివిడి గ్రంథాలయంలో ఘనంగా డాక్టర్ ఎస్.ఆర్. రంగనాథన్ జయంతి
చీపురుపల్లి: గ్రంథాలయ పితామహుడు డాక్టర్ సియాలి రామమృత రంగనాథన్ జయంతి సందర్భంగా గరివిడి శాఖా గ్రంథాలయంలో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం గ్రంథాలయాధికారి శ్రీమతి ఉషారాణి గారి ఆధ్వర్యంలో జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా ఆర్యవైశ్య సంఘ ఉపాధ్యక్షులు శ్రీ V.V.S.N. గుప్తా గారు, Rtd హిందీ మాస్టర్ శ్రీ సింహాచలం గారు రంగనాథన్ గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఆయన మాట్లాడుతూ 1892 సంవత్సరం ఆగస్టు 12వ తేదీన డాక్టర్ రంగనాథన్ జన్మించారని తెలిపారు. ఆయన లైబ్రరీ సైన్స్ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన వ్యక్తి అని, గొప్ప గణిత శాస్త్రజ్ఞుడు, దూరదృష్టి కలిగిన వ్యక్తి అని కొనియాడారు.
లైబ్రరీ సైన్స్ కు ఆయన చేసిన అద్భుతమైన రచనలకు గాను ఆయనకు “భారతదేశంలో లైబ్రరీ సైన్స్ పితామహుడు” అనే బిరుదు కూడా ఉందని గుప్తా గారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ పాఠకులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




