Palakonda: ఆయుర్వేద, హోమియో ఉచిత వైద్య శిబిరానికి 250 మంది హాజరు!

Palakonda: పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మున్సిపల్ కార్యాలయంలో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత ఆయుర్వేద, హోమియో వైద్య శిబిరం నిర్వహించారు.

S.K.MAIDHEEN, SRIKALAHASTI
Published on: 28 Aug 2026 5:37 PM IST
Palakonda
X

Palakonda: ఆయుర్వేద, హోమియో ఉచిత వైద్య శిబిరానికి 250 మంది హాజరు!

పాలకొండ: ఆంధ్రప్రదేశ్ ఆయుష్ (AYUSH) శాఖ ఆధ్వర్యంలో, పాలకొండ మున్సిపల్ కార్యాలయంలో ఆయుర్వేద వైద్యం సంబంధించి డాక్టర్ బి నందన సాయి మరియు డాక్టర్ బి శిరీష, అలాగే హోమియో వైద్యం సంబంధించి డాక్టర్ డి పావని విద్మహే మరియు డాక్టర్ డి ఆదిలక్ష్మి వార్ల నేతృత్వంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించబడింది.

ఈ శిబిరంలో శ్వాసకోశ సమస్యలు, చర్మ వ్యాధులు, కీళ్ల నొప్పులు, మూత్రపిండాల వ్యాధులు, జీర్ణ సంబంధిత వ్యాధులు మరియు స్త్రీలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు వంటి దీర్ఘకాలిక మరియు తీవ్రమైన అనారోగ్యాలకు ఇక్కడ ఆయుర్వేద మరియు హోమియోపతి మందులు ఉచితంగా అందించడం జరిగింది.

ఈరోజు పాలకొండ పట్టణంలో సుమారు 250 మంది వైద్య సేవలను వినియోగించుకున్నారు. ఇది చాలా మంచి కార్యక్రమమనీ, ఇది నగర పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేయడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఇంతవరకు ఆయుర్వేద హోమియోపతి మందులకు పెద్ద మొత్తంలో నగదు చెల్లించేవారమని ఇప్పుడు ఉచితంగా అందించడం సంతోషకరంగా ఉందన్నారు.

చుట్టుపక్కల షాపుల వారు ప్రజలు, నగర పంచాయతీ మరియు సచివాలయ సిబ్బంది ఈ సేవలను వినియోగించుకున్నారు. కార్యక్రమంలో కమిషనర్ పీవీ నూకరాజు గారు సిబ్బంది మరియు ప్రజలు పాల్గొన్నారు.

S.K.MAIDHEEN, SRIKALAHASTI

S.K.MAIDHEEN, SRIKALAHASTI

Next Story