Kurupam: కురుపాంలో ప్రపంచ జూనోసిస్ డే.. 86 కుక్కలకు ఉచిత టీకాలు!

Kurupam: జాతీయ జూనోసిస్ డే సందర్భంగా కురుపాం పశువైద్యాశాలలో సహాయ సంచాలకులు డా. శ్రీ సంధ్య ఆధ్వర్యంలో 86 పెంపుడు కుక్కలకు ఉచితంగా రేబిస్ టీకాలు వేశారు.

V.SESHU	, KURUPAM
Published on: 6 July 2026 1:24 PM IST
Kurupam
X

Kurupam: కురుపాంలో ప్రపంచ జూనోసిస్ డే.. 86 కుక్కలకు ఉచిత టీకాలు!

కురుపాం: జాతీయ జూనోసిస్ డే సందర్భంగా స్థానిక కురుపాం పశువైద్యాశాలలో సహాయ సంచాలకులు డా. శ్రీ సంధ్య ఆధ్వర్యంలో పెంపుడు కుక్కలకు ఉచిత రేబిస్ టీకాల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మొత్తం 86 పెంపుడు కుక్కలకు ఉచితంగా రేబిస్ టీకాలు వేశారు.

ఈ సందర్భంగా డా. శ్రీ సంధ్య మాట్లాడుతూ, జంతువుల నుండి మనుషులకు సంక్రమించే వ్యాధులను జూనోసిస్ వ్యాధులు అంటారని తెలిపారు. వాటిలో రేబిస్ అత్యంత ప్రమాదకరమైన సంక్రమిత వ్యాధి అని పేర్కొన్నారు. రేబిస్ వ్యాధి సోకిన తర్వాత సమర్థవంతమైన చికిత్స ఉండదని, కాబట్టి ముందస్తుగా టీకాలు వేయించుకోవడం ద్వారానే వ్యాధిని నివారించవచ్చని వివరించారు.

పెంపుడు జంతువులకు సమయానుకూలంగా టీకాలు వేయించడం ద్వారా సంక్రమిత వ్యాధులను అరికట్టవచ్చని, ప్రతి జంతు ప్రేమికుడు ఈ విషయంపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. అలాగే కుక్క కరిచిన వెంటనే గాయమైన ప్రదేశాన్ని పారుతున్న నీటితో శుభ్రంగా కడిగి, యాంటీసెప్టిక్ మందు ఉపయోగించాలని తెలిపారు. అనంతరం ఆలస్యం చేయకుండా సమీప వైద్య కేంద్రాన్ని సంప్రదించి తగిన చికిత్స పొందాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో లైవ్ స్టాక్ అసిస్టెంట్ గుంటముక్కల అఖిలేష్, పెంపుడు జంతువుల యజమానులు, పశుసంవర్ధక శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

V.SESHU	, KURUPAM

V.SESHU , KURUPAM

Next Story