Parvathipuram: సెప్టెంబర్ 11న వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం!
Parvathipuram: సెప్టెంబర్ 11న పార్వతీపురం YSRCP విస్తృత స్థాయి సమావేశం. వైసిపి శ్రేణులు తరలిరావాలని మాజీ ఎమ్మెల్యే జోగారావు పిలుపు.
Parvathipuram: సెప్టెంబర్ 11న వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం!
Parvathipuram: పార్వతీపురం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శ్రీ అలజంగి జోగారావు గారు బుధవారం తన క్యాంప్ కార్యాలయంలో అందుబాటులో గల నాయకులతో సమావేశమైన ఆయన మాట్లాడుతూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇటీవల జిల్లా స్థాయిలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించుకోవడం జరిగినది.
అని అలానే వచ్చే తేదీ.11-09-2026 శుక్రవారం ఉదయం 10:30 గంటలకు ఆర్యవైశ్య కల్యాణ మండపం, టౌన్ పోలీస్ స్టేషన్ వీధి, పార్వతీపురం వద్ద నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం తన అధ్యక్షతన నిర్వహించబోవుచున్న ఈ ముఖ్య సమావేశంలో పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు శత్రుచర్ల పరీక్షిత్ రాజు గారు ముఖ్య అతిథిలుగా పాల్గొనడం జరుగుతుంది.
అని కావున ఈ కార్యక్రమంలో మన నియోజకవర్గ వ్యాప్తంగా గల రాష్ట్ర, జిల్లా మరియు మండల స్థాయి పార్టీ కమిటీలోని సభ్యులు, అన్ని స్థాయిల పార్టీ అనుబంధ విభాగ కమిటీల అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, వైఎస్ ఎంపీపీలు, గ్రామ, వార్డు పార్టీ అధ్యక్షులు, మాజీ కౌన్సిలర్లు, మాజీ సర్పంచులు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు అందరూ ఈ సమావేశానికి పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరుతూ ఆయన అందరికీ పేరు పేరునా పిలుపు ఇవ్వడం జరిగినది.




