Parvathipuram: డీఎస్సీ అక్రమాలపై లోకేష్ రాజీనామాకు రాజన్న దొర డిమాండ్!

Parvathipuram: డీఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ సాలూరు బోసు బొమ్మ జంక్షన్‌లో మాజీ డిప్యూటీ సీఎం రాజన్న దొర ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ భారీ ర్యాలీ రోడ్డుపై బైఠాయింపు.

B VENKATESH, SALURU
Published on: 10 Aug 2026 1:21 PM IST
Parvathipuram
X

Parvathipuram: డీఎస్సీ అక్రమాలపై లోకేష్ రాజీనామాకు రాజన్న దొర డిమాండ్!

Parvathipuram: సాలూరు బోసు బొమ్మ జంక్షన్ లో వైసిపి పెద్ద ఎత్తున ర్యాలీ. డీఎస్సీ నియమకాల్లో అవకతవకలు జరిగాయి అంటూ వైసిపి పిలుపుమేరకు పెద్ద ఎత్తున ర్యాలీకి చేరుకున్న వైసీపీ శ్రేణులు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలంటూ మాజీ డిప్యూటీ సీఎం రాజన్న దొర రోడ్డుపై బైఠాయింపు.

మాజీ డిప్యూటీ సీఎం రాజన్న దొర మాట్లాడుతూ,ఉదయం నుండి నన్ను మా వైసిపి నాయకుల్ని హౌస్ హాస్టల్ చేశారు. ఇదేం పద్ధతి, మేమేమీ దోపిడీ దొంగతనం చేసామా, దోపిడీ చేశామా, మర్డర్ చేశామా అని వాపోయిన రాజన్నదొర.

శాంతిభద్రతలకు మేమెప్పుడూ భంగం కలిగించలేదు,డీఎస్సీ అవకతవకలపై పోరాటం చేస్తున్నాం. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా కోరుతున్నాం.

ఇంకా ప్రభుత్వంపై ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. అవన్నీ నీగ్గు తేల్చాలంటే సిబిఐ విచారణ మేము కోరుతున్నాం.

B VENKATESH, SALURU

B VENKATESH, SALURU

Next Story