Parvathipuram:50 పాఠశాల బస్సుల తనిఖీ పూర్తి డీటీఓ దుర్గాప్రసాద్ రెడ్డి

Parvathipuram: పార్వతీపురం మన్యం జిల్లాలో పాఠశాల బస్సుల భద్రతపై రవాణా శాఖ ప్రత్యేక నిఘా పెట్టింది.

V.SESHU	, KURUPAM
Published on: 10 May 2026 3:59 PM IST
Parvathipuram
X

Parvathipuram:50 పాఠశాల బస్సుల తనిఖీ పూర్తి డీటీఓ దుర్గాప్రసాద్ రెడ్డి

పార్వతీపురం: పార్వతీపురం మన్యం జిల్లాలో పారదర్శక పాలన మరియు ప్రజలకు మెరుగైన సేవలందించే లక్ష్యంతో జిల్లా రవాణా అధికారి దుర్గాప్రసాద్ రెడ్ది ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. జిల్లావ్యాప్తంగా ఉన్న మొత్తం 95 పాఠశాల బస్సు లలో, ఇప్పటివరకు 50 బస్సులు జిల్లా రవాణా అధికారులు తనిఖీ చేశారు. తనిఖీల్లో భాగంగా బస్సుల పనితీరు, సాంకేతిక స్థితిగతులు మరియు సమాచార ఖచ్చితత్వాన్ని అధికారి క్షుణ్ణంగా పరిశీలించారు.

ఈ తనిఖీలకు సంబంధించిన వివరాలను మరియు పురోగతిని మీడియా ద్వారా ప్రజలకు వివరించడం జరిగింది. ప్రభుత్వ వ్యవస్థలో జవాబుదారీతనం పెంచేందుకు మీడియా సహకారం తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తమైంది. మిగిలిన 45 బస్సులను కూడా నిర్ణీత గడువులోగా తనిఖీ చేసి, నివేదికను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ​ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్ని బస్సులు సక్రమంగా పనిచేసేలా చూడటమే ఈ తనిఖీల ముఖ్య ఉద్దేశమని డి.టి.ఓ ఈ సందర్భంగా తెలియజేశారు.

V.SESHU	, KURUPAM

V.SESHU , KURUPAM

Next Story