Cheepurupalli: వైఫల్యం విజయానికి తొలిమెట్టు.. డా. బొత్స అనూష

Cheepurupalli: పదో తరగతి ఫలితాల విడుదల సందర్భంగా విద్యార్థులకు డాక్టర్ బొత్స అనూష శుభాకాంక్షలు తెలిపారు.

G SIMHACHALAM,	CHIPURPALLY
Published on: 29 April 2026 8:51 PM IST
Cheepurupalli
X

Cheepurupalli: వైఫల్యం విజయానికి తొలిమెట్టు.. డా. బొత్స అనూష

Cheepurupalli: పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదలవుతున్న సందర్భంగా యువ నాయకురాలు డాక్టర్ బొత్స అనూష విద్యార్థులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు.

"విద్యాభ్యాసం అనేది అనంతమైన జ్ఞాన సముపార్జన ప్రక్రియ. కేవలం ఒక పరీక్షా ఫలితం విద్యార్థి మేధాశక్తిని గానీ, ఉజ్వల భవిష్యత్తును గానీ సంపూర్ణంగా నిర్ణయించజాలదు. ఉత్తీర్ణులైన విద్యార్థులు అత్యుత్సాహానికి లోనుకాకుండా, వినయంతో విజ్ఞానాన్ని సముపార్జించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలి" అని ఆమె ఆకాంక్షించారు.

ఆశించిన ఫలితాలు సాధించలేకపోయిన విద్యార్థులను ఉద్దేశించి డా. అనూష కీలక సందేశమిచ్చారు. "పరీక్షా వైఫల్యం మీ మేధస్సుకు ముగింపు కాదు, అది కేవలం ఒక చిన్న అవరోధం మాత్రమే. ఆవేదనకు లోనై అనాలోచిత నిర్ణయాలు తీసుకోవద్దు. పరాజయం పొందిన చోటనే ధైర్యంతో పుంజుకోవాలి. వైఫల్యాన్ని గుణపాఠంగా స్వీకరించి, రెట్టింపు ఉత్సాహంతో శ్రమించి విజయలక్ష్మిని వరించాలి" అని సూచించారు.

తల్లిదండ్రులకు కూడా ఆమె విజ్ఞప్తి చేశారు. "పిల్లల పట్ల సానుభూతితో, సంయమనంతో వ్యవహరించాలి. అనుత్తీర్ణులైన పిల్లలను మందలించకుండా వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపాలి. ప్రతి విద్యార్థిలోనూ ఒక విశిష్టమైన ప్రతిభ నిబిడీకృతమై ఉంటుంది. దానిని గుర్తించి ప్రోత్సహించడం మనందరి బాధ్యత" అని పేర్కొన్నారు.

"నవ్యాంధ్రప్రదేశ్ ఉజ్వల భవిష్యత్తు ఈ యువ కిశోరాల చేతుల్లోనే ఉంది. విద్యార్థులందరూ క్రమశిక్షణ, కార్యదీక్ష, పట్టుదలతో శ్రమించి సమాజానికి దిశానిర్దేశం చేసే ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దబడాలి" అని డా. బొత్స అనూష ఆకాంక్షిస్తూ విద్యార్థులందరికీ శుభాశీస్సులు తెలియజేశారు.

G SIMHACHALAM,	CHIPURPALLY

G SIMHACHALAM, CHIPURPALLY

Next Story