Parvathipuram: డీవీఎం హైస్కూల్లో మలేరియా నివారణ మందుల పంపిణీ!
Parvathipuram: పార్వతీపురం డీవీఎం హైస్కూల్‌లో డీఎంహెచ్ఓ డాక్టర్ పి. విజయలక్ష్మి ఆధ్వర్యంలో 450 మంది విద్యార్థులకు మలేరియా నివారణ మందులను పంపిణీ చేశారు.
Parvathipuram: డీవీఎం హైస్కూల్లో మలేరియా నివారణ మందుల పంపిణీ!
పార్వతీపురం: పార్వతీపురం పట్టణంలోని చర్చి వీధిలో గల డీవీఎం హైస్కూల్లో మలేరియా నివారణ చర్యల్లో భాగంగా విద్యార్థులకు మలేరియా నిరోధక మందులను జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. పి.విజయలక్ష్మి, జిల్లా హోమియోపతి వైద్యాధికారులు డా. బి.సుశీల, డా. కె.వర్మ పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో పాఠశాలలోని మొత్తం 450 మంది విద్యార్థులకు మలేరియా నివారణ మందులను అందజేశామన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మలేరియా వ్యాధి లక్షణాలు, నివారణ చర్యలు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, దోమల కాటుకు గురికాకుండా తగిన జాగ్రత్తలు పాటించడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు.
వర్షాకాలంలో దోమల వ్యాప్తి అధికంగా ఉండే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలని, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని వైద్యాధికారులు సూచించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు.




