Vizianagaram: విజయనగరం జిల్లాలో ప్రభుత్వ సంక్షేమ పథకాల పంపిణీ!

Vizianagaram: విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం కొత్తూరులో డీసీఎంఎస్ చైర్మన్ గొంప కృష్ణ పర్యటించి లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు.

K MUTHYALUNAIDU, SRUNGAVARAPUKOTA
Published on: 1 Sept 2026 12:31 PM IST
Vizianagaram
X

Vizianagaram: విజయనగరం జిల్లాలో ప్రభుత్వ సంక్షేమ పథకాల పంపిణీ!

Vizianagaram: శృంగవరపుకోట మండలం కొత్తూరు గ్రామంలో నిర్వహించిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ శ్రీ గొంప క్రిష్ణ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు పెన్షన్లను అందజేసి, వారితో ఆప్యాయంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.

పేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు తదితర అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు సకాలంలో అందేలా కృషి చేస్తామని ఆయన తెలిపారు. ప్రజల అవసరాలను తెలుసుకుని, వారి సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని భరోసా ఇచ్చారు.

K MUTHYALUNAIDU, SRUNGAVARAPUKOTA

K MUTHYALUNAIDU, SRUNGAVARAPUKOTA

Next Story