Parvathipuram: పొలం గట్లపై మొక్కలతో రైతులకు అదనపు ఆదాయం!
Parvathipuram: పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం సూరంపేటలో "గట్టు మీద చెట్టు" కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్.
Parvathipuram: పొలం గట్లపై మొక్కలతో రైతులకు అదనపు ఆదాయం!
Parvathipuram: రైతులు సంప్రదాయ పంటలతో పాటు పొలం గట్లపై మొక్కలను నాటడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు అదనపు ఆదాయాన్ని పొందవచ్చని జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి తెలిపారు.గురువారం సీతానగరం మండలం, సూరంపేట గ్రామంలో ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన "గట్టు మీద చెట్టు" కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
జాయింట్ కలెక్టర్ ఆర్. వైశాలితో కలిసి ఆయన పొలం గట్లపై మొక్కలను నాటి ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రైతులతో ముఖాముఖి మాట్లాడుతూ గట్టు మీద చెట్టు వలన కలిగే ప్రయోజనాలు, ఉపయోగాలను వివరించారు.
పొలం గట్లను ఖాళీగా ఉంచకుండా పండ్ల చెట్లు, వాణిజ్య లేదా ఉద్యానవన మొక్కలను నాటడం ద్వారా భూసారం పెరుగుతుందని, క్రమక్షయం తగ్గుతుందని చెప్పారు. పంటలతో పాటు గట్లపై పెరిగే చెట్ల ద్వారా భవిష్యత్తులో రైతులకు అదనపు ఆదాయం సమకూరుతుందని, ఇది ఆర్థిక స్వాలంబనకు ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్క రైతు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తమ పొలం గట్లపై మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్.వైశాలి, మండల ఉద్యానవన శాఖ అధికారులు, వ్యవసాయ శాఖ సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో గ్రామానికి చెందిన రైతులు ఉత్సాహంగా పాల్గొని పొలం గట్ల వెంబడి మొక్కలను నాటారు.




