Jiyammavalasa: రోగం వస్తే నాటు వైద్యుడి దగ్గరకు వెళ్తున్నారా? కలెక్టర్ వార్నింగ్ ఇదే!

Jiyammavalasa: నాటు వైద్యం, మూఢనమ్మకాలపై పార్వతీపురం జిల్లా కలెక్టర్ ప్రభాకర రెడ్డి హెచ్చరిక.

V.SESHU	, KURUPAM
Published on: 13 May 2026 5:40 PM IST
Jiyammavalasa
X

Jiyammavalasa: రోగం వస్తే నాటు వైద్యుడి దగ్గరకు వెళ్తున్నారా? కలెక్టర్ వార్నింగ్ ఇదే!

జీయ్యామ్మవలస: నాటు వైద్యం, మూడ నమ్మకాలతో దుష్ప్రభావాలు చోటు చేసుకుంటాయని జిల్లా కలెక్టర్ డా ఎన్. ప్రభాకరరెడ్డి అన్నారు. ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించే దిశగా "నాటు వైద్యానికో నమస్కారం" పేరిట వినూత్న కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. ఏవైనా కారణాలచే అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు తక్షణమే అందుబాటులో ఉన్న గ్రామస్థాయి ఆశ, ఏ.ఎన్.ఎం వైద్య సిబ్బందిని సంప్రదించి సమీపంలోని ఆరోగ్య కేంద్రం, ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం పొందాలని, ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేని నాటు వైద్యానికి దూరంగా ఉండాలన్నారు.

నాటు వైద్యం వల్ల ముఖ్యమైన శరీర అవయవాలు ఇన్ఫెక్షన్ కు గురవుతాయని, ప్రాణహాని ఉంటుందని పేర్కొన్నారు. వైద్యారోగ్యశాఖ, అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ సమన్వయంతో నాటు వైద్యం, మూడ నమ్మకాలు లేని జిల్లాగా తీర్చి దిద్దడమే ద్యేయంగా కృషి చేయాలన్నారు. అనంతరం నాటు వైద్యంపై అవగాహనకు వైద్యారోగ్యశాఖ ప్రదర్శించిన లఘునాటిక అందరినీ ఆకట్టుకుంది .

V.SESHU	, KURUPAM

V.SESHU , KURUPAM

Next Story