Parvathipuram: హ్యాట్సాఫ్ కలెక్టర్ గారు! ప్రభుత్వ బడిలో చేరిన కలెక్టర్ కుమారుడు!

Parvathipuram: జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర్ రెడ్డి తన కుమారుడిని స్థానిక డీవీఎం మున్సిపల్ ప్రభుత్వ హైస్కూల్‌లో చేర్పించి సమాజానికి ఆదర్శంగా నిలిచారు.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)
Published on: 18 Jun 2026 3:20 PM IST
Parvathipuram
X

Parvathipuram: హ్యాట్సాఫ్ కలెక్టర్ గారు! ప్రభుత్వ బడిలో చేరిన కలెక్టర్ కుమారుడు!

పార్వతీపురం: ఆదర్శంగా నిలిచిన కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి తన కుమారుడిని పార్వతీపురంలోని మున్సిపల్ పాఠశాలలో చేర్పించిన వైనం స్థానిక డివియం మున్సిపల్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి లో జాయిన్ అయిన ఉందిగా ఎన్. క్రిష్ ధరన్ రెడ్డి స్వయంగా కలెక్టర్ కుమారుడు తమ పాఠశాలలో అడ్మిషన్ తీసుకోవడం ప్రభుత్వ బడులకు మరింత ఆదరణ లభిస్తుందని తెలిపిన హెచ్ఎం శ్రీధర్.

ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్న అభివృద్ధి చూసి ప్రవేశాలు పెరుగుతున్నాయని అన్నారు. దీరచరణ్ రెడ్డి విజయవాడ లో కూడా సర్కారు బడి లో నే చదివినట్లు వెల్లడించారు. ప్రైవేట్ పాఠశాలలు కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో అన్ని సౌకర్యాలు ఉన్నాయని చెప్పారు.

పాఠశాల లో ముస్తాబు కార్యక్రమం తో సర్కారు బడులను ఉన్నతంగా తీర్చి దిద్దిన ఘనత మన్యం జిల్లా కలెక్టర్ దే అన్నారు. ఆయన అమలు చేసిన ఈ విధానం రాష్ట్ర స్థాయి లో అమల్లో ఉందన్నారు.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

Next Story