Parvathipuram: అంగన్వాడీ హెల్పర్లకు ప్రమోషన్లు కల్పించాలి!
Parvathipuram: పార్వతీపురం మన్యం జిల్లాలో అర్హులైన అంగన్వాడీ హెల్పర్లకు జీవో నెంబర్ 2 ప్రకారం ప్రమోషన్లు కల్పించాలని సీఐటీయూ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది.
Parvathipuram: అంగన్వాడీ హెల్పర్లకు ప్రమోషన్లు కల్పించాలి!
Parvathipuram: సుందరయ్య భవనంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి యమ్మల మన్మధరావు సిఐటియు నాయకులు మాట్లాడుతూ పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో గల బాగవలస పంచాయతీ బాగవలస గ్రామం అంగనవాడి 2 సెంటర్ వర్కర్ 2024 ఫిబ్రవరి లో రాజీనామా చేశారు సుమారు మూడు సంవత్సరాలు అవుతున్న ఇంతవరకు టీచర్ పోస్టు బర్టీ చేయలేదు అదే గ్రామంలో 1వ సెంటర్లో ఉన్నటువంటి హెల్పర్ పెరుమాల్ల సుమతి అంగనవాడి టీచర్ కు అర్హురాలు ఆమె పదో తరగతి ఉత్తీర్ణత అయి ఉంది.
2020 సంవత్సరము నుండి హెల్పర్ గా విధులు నిర్వహిస్తుంది. అనేక సందర్భంలో సాలూరు ప్రాజెక్ట్ అధికారి సిడిపిఓ గారికి జిల్లా పీడీ గారికి అర్జీలు ఇచ్చి విన్నవించినప్పటికి టీచర్ పోస్ట్ భర్తీ చేయడం లేదు ఇదే కాకుండా జిల్లాలో అనేక మంది హెల్పర్లు టీచర్ పోస్ట్ కు అర్హత కలిగి ఉన్నప్పటికీ ఖాళీ అయినటువంటి అంగనవాడి సెంటర్లో వెంటనే భర్తీ చేయడం లేదు కావున తక్షణమే సాలూరు ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో బాగవలస టు సెంటర్ టీచర్ పోస్ట్ కి అర్హత కలిగిన హెల్పర్
పెరుమల్ల సుమతికి జీవో నెంబర్ 2 ప్రకారం ఇవ్వాలని జిల్లాలో మిగతా టీచర్ పోస్టు అర్హత కలిగిన హెల్పర్లకు ప్రమోట్ చేయాలని లేని పక్షంలో పార్వతిపురం సిఐటియు జిల్లా కమిటీ ప్రత్యక్ష కార్యచరణకి దిగుతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు వి ఇందిరా, బొత్స వెంకటరమణ,, గొర్లి వెంకటరమణ, రెడ్డి వేణు*తదితరులు పాల్గొన్నారు.




