Cheepurupalli: రూ.2 లక్షల పూచీకత్తుతో రౌడీషీటర్లు బైండోవర్!
Cheepurupalli: చీపురుపల్లిలో రౌడీషీటర్లకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి, రూ.2 లక్షల పూచీకత్తుతో తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేశారు.
Cheepurupalli: రూ.2 లక్షల పూచీకత్తుతో రౌడీషీటర్లు బైండోవర్!
చీపురుపల్లి: చీపురుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీషీట్లు కలిగిన వ్యక్తులకు పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ జి.శంకర్ రావు, ఎస్ఐ పి.వెంకటేశ్వర్ రావు ఆధ్వర్యంలో వారిని స్టేషన్ కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు.
ఈ సందర్భంగా సీఐ శంకర్ రావు మాట్లాడుతూ, "షీటర్లందరూ సత్ప్రవర్తనతో మెలగాలి. మద్యం సేవించి సినిమా హాళ్లు, మార్కెట్, బస్ స్టేషన్, బహిరంగ ప్రదేశాల్లో ప్రజలకు అసౌకర్యం కలిగిస్తే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటాం" అని హెచ్చరించారు.
సత్ప్రవర్తనతో ఉండేలా రూ.2 లక్షల పూచీకత్తుతో చీపురుపల్లి తహసీల్దార్ సమక్షంలో బైండోవర్ చేశామని తెలిపారు. ఇటీవల అనురాగ్-అమోఘ్ థియేటర్లలో జరిగిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతమైతే మరింత కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.




