Cheepurupalli: మిస్సింగ్ కేసును 7 రోజుల్లో ఛేదించిన చీపురుపల్లి పోలీసులు
Cheepurupalli: విజయనగరం జిల్లా చీపురుపల్లిలో కలకలం రేపిన తల్లీ, ఇద్దరు పిల్లల అదృశ్యం మిస్టరీని పోలీసులు వారం రోజుల్లోనే ఛేదించారు.
Cheepurupalli: మిస్సింగ్ కేసును 7 రోజుల్లో ఛేదించిన చీపురుపల్లి పోలీసులు
Cheepurupalli: కుటుంబ కలహాల నేపథ్యంలో ఇద్దరు చిన్నారులతో సహా అదృశ్యమైన మహిళను చీపురుపల్లి పోలీసులు వారం రోజుల్లోనే హైదరాబాద్లో గుర్తించి క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు.
ఘటన వివరాలు:
చీపురుపల్లి గ్రామం అంబేద్కర్ కాలనీకి చెందిన జమ్మూ గౌతమి భర్తతో మనస్పర్థల కారణంగా కొంతకాలంగా తన ఇద్దరు పిల్లలు జమ్మూ చక్రధర్ (4 సం.), జమ్మూ నిహాల్ (2 సం.)తో కలిసి కన్నవారి ఇంటి వద్ద ఉంటున్నారు. అయితే అన్నావదినల మధ్య గొడవలు జరుగుతుండడంతో వారికి భారం కాకూడదనే ఉద్దేశంతో, ఎక్కడికైనా వెళ్లి పనిచేసుకుని బతకాలని నిర్ణయించుకున్నారు.
ఈ క్రమంలో తేదీ 12.05.2026న ఉదయం 10.00 గంటల సమయంలో తన ఇద్దరు పిల్లలతో కలిసి తల్లిదండ్రులకు, బంధువులకు ఎవరికీ చెప్పకుండా ఇంటి నుండి వెళ్లిపోయారు.
పోలీసుల చర్యలు:
ఈ విషయంపై బాధిత తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు చీపురుపల్లి పోలీస్ స్టేషన్లో http://Cr.No 33/2026 U/s Woman and Children Missing గా కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, సాంకేతిక పరిజ్ఞానం ఉన్న పోలీస్ కానిస్టేబుళ్లతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు, చాలా తక్కువ సమయంలోనే హైదరాబాద్లో తన ఇద్దరు పిల్లలతో ఉన్న జమ్మూ గౌతమిని గుర్తించారు.
కౌన్సెలింగ్ & అప్పగింత:
తేదీ 19.05.2026న చీపురుపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు జమ్మూ గౌతమికి, ఆమె తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించి, క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు.
చాలా తక్కువ సమయంలో తమ కుమార్తెను, ఇద్దరు మనవళ్లను వెతికి పట్టుకుని క్షేమంగా అప్పగించిన చీపురుపల్లి పోలీసుల పనితీరుపై బాధిత కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేసి, పోలీసు శాఖకు కృతజ్ఞతలు తెలిపారు.




