Cheepurupalli: చీపురుపల్లిలో మహానాడు జోష్.. క్లస్టర్ మీటింగ్స్‌లో ఎమ్మెల్యే
Cheepurupalli: విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో ‘మహానాడు-2026’ రెండో రోజు క్లస్టర్ సమావేశాలు అత్యంత ఉత్సాహంగా సాగాయి.
Cheepurupalli: చీపురుపల్లిలో మహానాడు జోష్.. క్లస్టర్ మీటింగ్స్‌లో ఎమ్మెల్యే
Cheepurupalli: చీపురుపల్లి నియోజకవర్గంలో 'మహానాడు-2026' రెండో రోజు క్లస్టర్ సమావేశాలు బుధవారం అత్యంత ఉత్సాహంగా జరిగాయి. మెరకముడిదాం, గుర్ల మండలాల్లోని ఐదు క్లస్టర్లకు ఎమ్మెల్యే శ్రీ కిమిడి కళావెంకటరావు గారు విస్తృతంగా పర్యటించారు. కేవలం లాంఛనంగా కాకుండా ప్రతి క్లస్టర్‌లోనూ కార్యకర్తలతో గంటల తరబడి గడిపి, వారి సూచనలు, సలహాలు స్వీకరించారు.
ఎన్టీఆర్ జయంతి వేడుకలను ప్రతి గ్రామ స్థాయిలో జరుపుకోవాలని, ఆయన చేసిన సేవలను నేటి తరానికి తెలియజేయాలని ఎమ్మెల్యే సూచించారు. బూత్ స్థాయిలో పార్టీ నిర్మాణాన్ని పటిష్టం చేయడం, ప్రభుత్వ పథకాల అమలులో చురుగ్గా పాల్గొనడంపై కార్యాచరణ రూపొందించారు.
ఈ కార్యక్రమాల్లో క్లస్టర్ ఇన్‌చార్జిలు, మండల పార్టీ అధ్యక్షులు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో తెలుగుదేశం కార్యకర్తలు పాల్గొని ఎమ్మెల్యే పర్యటనను విజయవంతం చేశారు.




