Cheepurupalli: చీపురుపల్లిలో ప్రజా దర్బార్‌కు పోటెత్తిన ప్రజలు: ఎమ్మెల్యే కళా వెంకటరావు

Cheepurupalli: చీపురుపల్లిలో ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు.

G SIMHACHALAM,	CHIPURPALLY
Published on: 5 Sept 2026 3:17 PM IST
Cheepurupalli
X

Cheepurupalli: చీపురుపల్లిలో ప్రజా దర్బార్‌కు పోటెత్తిన ప్రజలు: ఎమ్మెల్యే కళా వెంకటరావు

చీపురుపల్లి: ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని సత్వర పరిష్కారం చూపించాలనే లక్ష్యంతో చీపురుపల్లి ఎమ్మెల్యే శ్రీ కిమిడి కళా వెంకటరావు గారు శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు.

ఉదయం 10.30 గంటల నుండి ప్రారంభమైన ఈ ప్రజా దర్బార్‌కు నియోజకవర్గంలోని వివిధ మండలాలు, గ్రామాల నుండి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తాగునీరు, రహదారులు, విద్యుత్, పారిశుధ్యం, పింఛన్లు, రెవెన్యూ సమస్యలు, సంక్షేమ పథకాలకు సంబంధించి సుమారు 30 వినతులను ఎమ్మెల్యే గారికి అందజేశారు.

ప్రతి ఒక్కరి సమస్యను ఎమ్మెల్యే కళా వెంకటరావు గారు ఓపికగా విని, సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి తక్షణ పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, "ప్రజల సమస్యల పరిష్కారంలో జాప్యం జరగకూడదు. అధికారులు సమన్వయంతో పనిచేసి నిబంధనల ప్రకారం త్వరగా పరిష్కారం చూపాలి. అత్యవసర సమస్యలకు ప్రాధాన్యత ఇవ్వాలి" అని సూచించారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చూస్తామని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. ప్రజా దర్బార్ వల్ల ప్రజలకు, ప్రభుత్వ యంత్రాంగానికి మధ్య సమన్వయం మరింత బలపడుతుందని ఆయన పేర్కొన్నారు.

G SIMHACHALAM,	CHIPURPALLY

G SIMHACHALAM, CHIPURPALLY

Next Story