Vizianagaram: గెడ్డపువలసలో బొత్స పరామర్శ: కృష్ణంనాయుడు కుటుంబానికి భరోసా!

Vizianagaram: గెడ్డపువలసలో ఇటీవల మరణించిన మాజీ ఎంపీపీ కొనిసి కృష్ణంనాయుడు కుటుంబాన్ని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ పరామర్శించి ఓదార్చారు.

G SIMHACHALAM,	CHIPURPALLY
Published on: 26 Aug 2026 6:00 PM IST
Vizianagaram
X

Vizianagaram: గెడ్డపువలసలో బొత్స పరామర్శ: కృష్ణంనాయుడు కుటుంబానికి భరోసా!

విజయనగరం: రాజకీయాల్లో పదవులు వస్తాయి, పోతాయి.. కానీ వ్యక్తిగత సంబంధాలు శాశ్వతం అని నిరూపించారు మాజీ మంత్రి, శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. గరివిడి మండలం గెడ్డపువలస గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ, పార్టీ సీనియర్ నేత కొనిసి కృష్ణంనాయుడు ఇటీవల అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. మూడు దశాబ్దాలుగా ప్రజా జీవితంలో ఉన్న ఆయన మృతి పట్ల బొత్స తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

నేడు (26-08-2026) తన బిజీ కార్యక్రమాలను పక్కనపెట్టి నేరుగా గెడ్డపువలసలోని కృష్ణంనాయుడు స్వగృహానికి చేరుకున్న బొత్స, ఆయన భార్యను, కుమారుడు కల్యాణ్ ని మరియు కుటుంబ సభ్యులను పరామర్శించారు. తండ్రిని కోల్పోయిన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా కృష్ణంనాయుడుతో తనకున్న దశాబ్దాల అనుబంధాన్ని కంటతడితో గుర్తు చేసుకున్నారు. "పార్టీ కోసం, ప్రజల కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం. పార్టీ ఎల్లవేళలా మీకు అండగా ఉంటుంది" అని భరోసా ఇచ్చారు.

ఉన్నత శిఖరాలకు ఎదిగినా, కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకునే బొత్స నైజానికి ఇదే నిదర్శనమని నాయకులు కొనియాడారు. అడవిని కాసే చెట్టులా, కష్టకాలంలో అండగా నిలిచే నాయకుడు బొత్స అని అన్నారు. ఈ పరామర్శ కార్యక్రమంలో మండల నాయకులు మీసాల విశ్వేశ్వరరావు, ఎడ్ల అప్పారావు, లెంక శ్రీరాములు, శ్రీరాములు నాయుడు, వివిధ గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొని నివాళులర్పించారు.

G SIMHACHALAM,	CHIPURPALLY

G SIMHACHALAM, CHIPURPALLY

Next Story