Cheepurupalli: బొత్స అనూష పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు

Cheepurupalli: విపక్ష నేత బొత్స సత్యనారాయణ కుమార్తె డాక్టర్ బొత్స అనూష జన్మదిన వేడుకలు గుర్లలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి.

G SIMHACHALAM,	CHIPURPALLY
Published on: 12 Aug 2026 7:28 PM IST
Cheepurupalli
X

Cheepurupalli: బొత్స అనూష పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు

చీపురుపల్లి: రాష్ట్ర మాజీ మంత్రివర్యులు, ఎమ్మెల్సీ, రాష్ట్ర శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ గారి కుమార్తె డాక్టర్ బొత్స అనూష గారి జన్మదిన వేడుకలు గుర్లలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలను మండల పార్టీ అధ్యక్షుడు శ్రీ పొట్నూరు సన్యాసినాయుడు గారి ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా కేక్ కట్ చేసి డాక్టర్ బొత్స అనూష గారికి పార్టీ పెద్దలు, వైఎస్ఆర్సీపి నాయకులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ కె.వి. సూర్య నారాయణ రాజు గారు, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు మరియు పలువురు పార్టీ శ్రేణులు పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు అందజేశారు. డాక్టర్ బొత్స అనూష గారు ప్రజా సేవలో మరిన్ని ఉన్నత శిఖరాలను అందుకోవాలని అందరూ ఆకాంక్షించారు.

G SIMHACHALAM,	CHIPURPALLY

G SIMHACHALAM, CHIPURPALLY

Next Story