Vizianagaram: బొబ్బిలిలో వైసీపీ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు

Vizianagaram: బొబ్బిలిలో వైసీపీ ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో శ్రేణులు ఆందోళనకు దిగి, మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

P SRINIVASARAO,	BOBBILI
Published on: 10 Aug 2026 1:15 PM IST
Vizianagaram
X

Vizianagaram: బొబ్బిలిలో వైసీపీ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు

విజయనగరం జిల్లా...

బొబ్బిలి నియోజకవర్గ ఇంచార్జ్ శంబంగి వెంకట చిన్న అప్పలనాయుడు ఆధ్వర్యంలో పట్టణంలోని అమ్మి గారి కోనేరు గట్టు వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహం వద్ద నుండి ర్యాలీగా బయలుదేరేందుకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.బొబ్బిలి పట్టణంలో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉందని, ఎలాంటి ర్యాలీలు, ధర్నాలకు అనుమతి లేదని పోలీసులు భారీ బందోబస్తు మధ్య వారిని అక్కడికక్కడే అడ్డుకున్నారు.

దీంతో అదే స్థలంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు.

శంబంగి వెంకట చిన్న అప్పలనాయుడు మాట్లాడుతూ..

కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. DSC పేపర్ లీకేజీ జరిగింది, దీనిపై CBI విచారణ చేయాలనీ ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు వెంటనే చెల్లించాలి. నిరుద్యోగులకు నెలకు 3000 రూపాయల భృతి ఇవ్వాలి. ఈ వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలి.

DSC లీకేజీ, ఇతర అంశాలపై CBI విచారణ చేయాలని, శంబంగి డిమాండ్ చేశారు.

ప్రజా సమస్యలపై తమ పోరాటం ఆగదని, ప్రభుత్వం తక్షణమే స్పందించాలని వైసీపీ నేతలు హెచ్చరించారు.

P SRINIVASARAO,	BOBBILI

P SRINIVASARAO, BOBBILI

Next Story