Bobbili: బొబ్బిలిలో ఈ నెల 24న ఘనంగా మెగా జాబ్ మేళా
Bobbili: బొబ్బిలి విద్వాన్ డిగ్రీ కళాశాలలో ఈ నెల 24న మెగా జాబ్ మేళా. 32కు పైగా కంపెనీలు, 3000లకు పైగా ఉద్యోగ అవకాశాలు. నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలి.
Bobbili: బొబ్బిలిలో ఈ నెల 24న ఘనంగా మెగా జాబ్ మేళా
బొబ్బిలి: బొబ్బిలిలోని స్థానిక విద్వాన్ డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా ఏర్పాటు చేస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ రెడ్డి మోహన్రావు, ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. సాయికిరణ్ యాదవ్ తెలిపారు. ఈ నెల 24వ తారీఖు సోమవారం ఉదయం 10 గంటలకు జాబ్ మేళా ప్రారంభం అవుతుందని వారు వెల్లడించారు.
ఈ జాబ్ మేళాలో మల్టీనేషనల్ కంపెనీలు, IT కంపెనీలు, ఫార్మా కంపెనీలతో పాటు 32 కి పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయన్నారు. 10,వ తరగతి నుండి PG వరకు, ITI నుండి B.Tech, MBA, పాలిటెక్నిక్ విద్యార్థులకు 3000 పైగా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. జాబ్ మేళాకు వచ్చే వారు రెజ్యూమ్ మరియు విద్యా సర్టిఫికెట్ల జిరాక్స్ లు తీసుకురావాలని సూచించారు. రిజిస్ట్రేషన్ పూర్తిగా ఉచితమని, సెలెక్ట్ అయిన వారికి అక్కడికక్కడే నియామక పత్రాలు అందజేస్తామని వారు స్పష్టం చేశారు.
మరిన్ని వివరాలకు: ప్రిన్సిపల్ రెడ్డి మోహన్రావు - 94920 23334
బి. సాయికిరణ్ యాదవ్ - 9542254838




