Bobbili: పత్రికా స్వేచ్ఛను కాపాడాలి, విలేకరులకు రక్షణ కల్పించాలి!
Bobbili: విజయనగరం జిల్లా బొబ్బిలిలో విశాలాంధ్ర రిపోర్టర్ గోవింద్‌పై దాడిని ఖండిస్తూ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో తహశీల్దార్కు వినతిపత్రం.
Bobbili: పత్రికా స్వేచ్ఛను కాపాడాలి, విలేకరులకు రక్షణ కల్పించాలి!
Bobbili: పూసపాటి రేగ విశాలాంధ్ర రిపోర్టర్ గోవింద్ పై భూ కబ్జాదారుల దాడి ను ఖండిస్తున్న బొబ్బిలి మీడియా.బొబ్బిలి తహశీల్దార్ కార్యాలయం వద్ద స్థానిక ఎలక్ట్రాన్ మీడియా ప్రింట్ మీడియా ప్రజాసంఘాల ఐక్యవేదిక నాయకులు ఆధ్వర్యంలో పూసపాటిరేగ విశాలాంధ్ర రిపోర్టర్ పందిరిపల్లి గోవింద పై రియల్ ఎస్టేట్ మాఫియా హత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తుల పైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేసి తహశీల్దార్ ఎం శ్రీను కు వినతి పత్రం అందజేశారు
ఈ సందర్భంగా తహశీల్దార్ ఎం శ్రీను మాట్లాడుతూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని విలేకరులకు హామీ ఇచ్చారు. సందర్భంగా స్థానిక ఆంధ్రజ్యోతి సీనియర్ రిపోర్టర్ కందుల శ్రీనివాస్ మాట్లాడుతూ పత్రిక స్వేచ్ఛను కాపాడాలని విలేకరులకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని దాడికి పాల్పడిన వ్యక్తుల పైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్లు, విశాలాంధ్ర రిపోర్టర్ రేఖ తౌడు, సాక్షి రిపోర్టర్లు వ్యాస్, ఆర్కే నాయుడు, హరి, పితాని శ్రీనివాస్,మొకర రాజేష్, కిశోర్ ,తిరుమల రావు, శర్మ, రాయగడ జగదీష్, బొద్దాన శీను, బెల్లాన రఘు, రూంకాన రమేష్, వెంకీ నాయుడు, మూర్తి.
సిపిఐ పట్టణ కార్యదర్శి మునకాల శ్రీనివాస్,కోట అప్పన్న, రామ్మూర్తి, పిల్లా లక్ష్మణరావు, అలమండ సురేష్, పుణ్యవతి, ఆర్ నాగమ్మ,రైతు సంక్షేమ సంఘం అధ్యక్షులు వేమిరెడ్డి లక్ష్మి నాయుడు, పొడుగు అశోక్, తదితరులు పాల్గొన్నారు.




