Bobbili: విజయనగరంలో వైయస్సార్‌సీపీ నిరసన పోస్టర్ ఆవిష్కరణ
Bobbili: విజయనగరంలో ఈ నెల 28న వైయస్సార్‌సీపీ విద్యార్థి, యువత నిరసన ప్రదర్శన. బొబ్బిలి క్యాంప్ కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే శంబంగి.
Bobbili: విజయనగరంలో వైయస్సార్‌సీపీ నిరసన పోస్టర్ ఆవిష్కరణ
బొబ్బిలి: విద్యార్థులు, నిరుద్యోగ యువత పట్ల రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న నిరసన కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను బొబ్బిలి మాజీ శాసనసభ్యులు శంబంగి వెంకట చిన అప్పలనాయుడు బొబ్బిలి క్యాంప్ కార్యాలయంలో ఆవిష్కరించారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు 28-07-2026 (మంగళవారం) ఉదయం 10 గంటలకు విజయనగరం న్యూ పూర్ణ మున్సిపల్ ఆఫీస్ వద్ద నుంచి మూడు లాంతర్ల వరకు నిరసన ప్రదర్శన నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో విద్యార్థులు, నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు మాట్లాడుతూ, డీఎస్సీ నియామకాల్లో జరిగిన అవకతవకలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులు, నిరుద్యోగ యువతకు న్యాయం జరిగేలా పోరాటం కొనసాగించాలని పిలుపునిచ్చారు.
డీఎస్సీ నియామకాల వ్యవహారంలో జరిగిన పరిణామాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు నెంబర్ ఇంటి గోపాలరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ సావు వెంకట మురళీకృష్ణారావు, బొబ్బిలి మండల పార్టీ అధ్యక్షుడు తమ్మిరెడ్డి దామోదరరావు, బొబ్బిలి పట్టణ పార్టీ అధ్యక్షుడు చోడిగంజి రమేష్ నాయుడు , పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.




