Bobbili: ఈపీఎస్ 95 పెన్షనర్లకు రూ 9 వేల పెన్షన్ ఇవ్వాలి ఏపీఆర్‌పీఏ!
Bobbili: ఈపీఎస్ 95 పెన్షనర్లకు కనీస పెన్షన్ రూ. 9 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బొబ్బిలి ఆర్డీవో ఆఫీస్ వద్ద ఏపీఆర్‌పీఏ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
Bobbili: ఈపీఎస్ 95 పెన్షనర్లకు రూ 9 వేల పెన్షన్ ఇవ్వాలి ఏపీఆర్‌పీఏ!
Bobbili: దేశవ్యాప్తంగా 72 లక్షలు మంది ఉన్న ఈపీఎస్ 95 పెన్షనర్లకు 1000/- నుండి పెన్షన్ 9000/- రూపాయలు డి ఏ తో కలిపి చెల్లించాలని ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు పి. శంకర్రావు ఉపాధ్యక్షులు వి. శేషగిరి డిమాండ్ చేశారు. ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న ధర్నాలో భాగంగా బొబ్బిలి ఆర్ డి ఓ ఆఫీస్ ధర్నా జరిగింది. ఆర్డీవో గారి ద్వారా ప్రధాన మంత్రి గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా గడిచిన 12 సంవత్సరాలుగా ఈపీఎఫ్ 95 పెన్షనర్లకు కనీస పెన్షన్ 9000/- రూపాయలు డిఏ తో చెల్లించాలని, ఉచిత వైద్య సౌకర్యం, రైల్వే ప్రయాణంలో రాయితీలు కల్పించాలని డిమాండ్ చేశారు. వెయ్యి రూపాయలు పెన్షన్ తో తన అవసరాలు ఎలా తీరుతాయని అన్నారు తిండి, మందులు, ఇతర అవసరాలకు ఇప్పుడున్న ధరలు తో ఎలా బ్రతకాలని అన్నారు.
అదేవిధంగా పార్లమెంటులో ప్రతిపక్ష ఎంపీలు, పార్లమెంట్ స్థాయి సంఘం అనేక కమిటీలు పెన్షనర్లకు కనీస పెన్షన్ 1000/- నుండి 7,500 ఒక కమిటీ 3000 ఒక కమిటీ ఇవ్వాలని ఇతర డిమాండ్లు పరిష్కరించాలని నివేదిక ఇచ్చినప్పటికీ మోడీ ప్రభుత్వానికి మానవత్వం లేదన్నారు. దేశంలో లక్షల కోట్ల రూపాయలు ఆదానీ, అంబానీకి దోచిపెడుతున్న బిజెపి ప్రభుత్వం పెన్షనర్ల పట్ల చాలా నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుందన్నారు.
ఈపీఎస్ 95 పెన్షనర్లకు సంబంధించిన కార్పస్పండు ఈపీఎఫ్ఓ వద్ద 10 లక్షల కోట్ల రూపాయలు కార్పస్ ఫండ్ నిలవ ఉంది. దీనిపైన 60 వేల కోట్ల రూపాయలు ప్రతి ఏటా వడ్డీ రూపంలో జమ అవుతున్నది. ఈ సొమ్ము నుండైనా ఈపీఎస్ 95 పెన్షనర్లకు కనీస పెన్షన్ 5000/- రూపాయలు చెల్లించవచ్చ కానీ మోడీ ప్రభుత్వం పెన్షనర్లకు మొండి చేయి చూపిస్తుంది.
పైగా పెన్షనర్లు డబ్బులు షేర్ మార్కెట్ కు తరలిస్తున్నారు. సంపద సృష్టికర్తలు కార్మికులు వృద్ధాప్యంలో గౌరవంగా బ్రతకడానికి కనీస పెన్షన్ ఇవ్వకుండా ఈ దుర్మార్గానికి ఒడి కడుతున్నది. బిజెపి ప్రభుత్వం పెన్షన్ దారులు సమస్యలు పరిష్కారం చేయని యెడల డిసెంబర్ 17 చలో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద యువకులు మీ మెడలు వంచారు వృద్ధులు కూడా అదే జంతర్ మంతర్ వద్ద మీకు రాజకీయ సమాధి పడతారని అన్నారు ధర్నా కార్యక్రమంలో అక్కపోలు సింహాచలం, టివి రమణ, మహేష్, షేక్ ఇస్మాయిల్, పెన్షన్ దారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.




