Kurupam: కురుపాం సంతలో ఆయుష్ వైద్య శిబిరం!
Kurupam: పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం సంతలో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించి, గిరిజనులకు ఆయుర్వేద వైద్య సేవలు అందించి మందులు పంపిణీ చేశారు.
Kurupam: కురుపాం సంతలో ఆయుష్ వైద్య శిబిరం!
Kurupam: ఆయుష్ వైద్య సేవలను గ్రామీణ ప్రజలకు మరింత చేరువ చేస్తున్నామని జిల్లా ఆయుష్ వైద్యాధికారి డాక్టర్ టి. హేమాక్షి అన్నారు. గురువారం కురుపాం సంత లో ఆయుష్ వైద్యాధికారి డా. వై. పూజిత తో కలిసి వైద్య శిబిరం నిర్వహించారు.
పలు దీర్ఘకాలిక సమస్యలు, కాలానుగున రుగ్మతలకు తనిఖీలు జరిపి పరీక్షించి అవసరమైన ఆయుర్వేద మందులు అందజేశారు. సంత కారణంగా మారుమూల గిరిజన గ్రామాల నుండి వచ్చిన అనేక మంది శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నారు.
120 మందికి పైగా మందులు అందజేసి వినియోగించు విధానాన్ని వివరించారు. శిబిరంలో డాక్టర్ హేమాక్షి మాట్లాడుతూ మన దేశ ఆయుర్వేద వైద్య విధానానికి ఎంతో ప్రాచుర్యం ఉందని, అనేక రుగ్మతలకు ఆయుర్వేదంతో మంచి ఫలితాలు వస్తున్నాయని ప్రభుత్వం పంపిణీ చేస్తున్న మందులు అందుబాటులో ఉన్నాయని,
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వైద్య శిబిరాలు నిర్వహిస్తూ ఆయుష్ సేవలను గ్రామీణ ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకువస్తున్నామని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆయుష్ వైద్యాధికారి వై. పూజిత, ఆయుష్ స్టాఫ్ పైడితల్లి, విజయ, పద్మ, అనిల్ తదితరులు పాల్గొన్నారు.




