Saluru: గిరిజన తల్లులు, శిశువుల ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట
Saluru: గిరిజన ప్రాంతాల్లోని గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువుల ఆరోగ్యం, భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి స్పష్టీకరణ.
Saluru: గిరిజన తల్లులు, శిశువుల ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట
సాలూరు: గిరిజన ప్రాంతాల్లోని గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువుల ఆరోగ్యం, భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని గిరిజన సంక్షేమ, స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. సాలూరు ఏరియా హాస్పిటల్‌కు 102 తల్లీ–బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనం అందుబాటులోకి రావడం పట్ల మంత్రి సంతోషం వ్యక్తం చేశారు.
మారుమూల గిరిజన ప్రాంతాల్లోని తల్లులు, బిడ్డలకు ఈ సేవలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం తల్లీ–బిడ్డలను ఉచితంగా, సురక్షితంగా వారి ఇళ్లకు చేర్చడంతో పాటు, అవసరమైన సందర్భాల్లో ఆసుపత్రికి రవాణా సౌకర్యం కల్పించడం ఈ సేవల ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
ముఖ్యంగా కొండలు, మారుమూల ప్రాంతాల్లో నివసించే గిరిజన కుటుంబాలకు రవాణా ఇబ్బందులు లేకుండా తల్లీ–బిడ్డలకు మెరుగైన సేవలు అందించేందుకు ఈ వాహనాలు ఎంతగానో దోహదపడతాయని మంత్రి తెలిపారు.
“గిరిజన ప్రాంతంలో పుట్టే ప్రతి బిడ్డ ఆరోగ్యంగా ఎదగాలి… ప్రతి గిరిజన తల్లికి వైద్యం అందుబాటులో ఉండాలి. మారుమూల ప్రాంతంలో ఉన్నా వైద్య సేవలకు దూరం కాకూడదు. తల్లీ–బిడ్డల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుంది” అని మంత్రి స్పష్టం చేశారు.




