Kurupam: గిరిజన గ్రామాల్లో నీటి కష్టాలు తీర్చండి.. లేదంటే రాస్తారోకో తప్పదు: ఆదివాసీ గిరిజన సంఘం
Kurupam: పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలంలో గిరిజన గ్రామాల తాగునీటి సమస్యలపై ఆదివాసీ గిరిజన సంఘం ఆగ్రహం.
Kurupam: గిరిజన గ్రామాల్లో నీటి కష్టాలు తీర్చండి.. లేదంటే రాస్తారోకో తప్పదు: ఆదివాసీ గిరిజన సంఘం
కురుపాం (పార్వతీపురం మన్యం జిల్లా): పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలంలో గిరిజన గ్రామాల తాగునీటి సమస్యల పరిష్కారం కోసం RWS శాఖ అధికారులు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు డిమాండ్ చేసారు.ఈ సందర్భంగా ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కమిటీ సభ్యులు మండంగి ఇండియా మాట్లాడుతూ, మండలంలోని అనేక గిరిజన గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. RWS అధికారులు గతంలో పైప్‌లైన్ పనులు, బోర్లు, ట్యాంకుల నిర్మాణానికి హామీ ఇచ్చినప్పటికీ నేటివరకు అవి కాగితాలకే పరిమితమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.
వేసవిలో గిరిజన ప్రజలు మైళ్ల దూరం వెళ్లి నీళ్లు తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొందన్నారు. కురుపాం మండలం ఎగులవాడ పంచాయతీ సందిగూడ గ్రామం మంజూరైన తాగునీటి పనులను వెంటనే ప్రారంభించాలని,ఇచ్చిన హామీలకు కాలపరిమితి విధించి పనులు పూర్తి చేయాలి. పనుల్లో జాప్యానికి కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలి. పనుల పురోగతిని పారదర్శకంగా గ్రామస్థులకు తెలియజేయాలని డిమాండ్ చేశారు.
వారం రోజుల్లో హామీలు అమలు చేయకపోతే ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా, రాస్తారోకో కార్యక్రమాలు చేపడతామని మండంగి ఇండియా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల, జిల్లా కమిటీ సభ్యులు ఇండియా, గ్రామ పెద్దలు పత్తి, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.




