Visakhapatnam: లక్ష్మీవానిపాలెంలో తాగునీటి ఎద్దడిపై కేకే రాజు ఆగ్రహం!

Visakhapatnam: విశాఖ లక్ష్మీవానిపాలెంలో తాగునీటి ఎద్దడిపై వైకాపా జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆగ్రహం. సమస్యను పరిష్కరించకపోతే జీవీఎంసీ ముట్టడిస్తామని హెచ్చరిక.

JAI RAM, MADURAWADA
Published on: 15 Sept 2026 10:57 AM IST
Visakhapatnam
X

Visakhapatnam: లక్ష్మీవానిపాలెంలో తాగునీటి ఎద్దడిపై కేకే రాజు ఆగ్రహం!

Visakhapatnam: విశాఖలో కొద్ది నెలలుగా తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. తాడిపూడి, మూడసర్లోవ గంభీరం లాంటి ప్రాజెక్టులపై ప్రభుత్వం ఎలాంటి స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్లడం లేదు, వేల కోట్ల విలువైన భూములను చౌకగా కేటాయించడంపై ఉన్న శ్రద్ధ.. ప్రజలకు తాగునీరు అందించడంపై లేదు.

రాష్ట్రంలో ప్రస్తుతం“వాటర్ దొరకదు క్వార్టర్ దొరుకుతుంది”, పోలవరం నీటిని విశాఖకు తీసుకొస్తామని చెప్పారు. ఇప్పటివరకు నీరు ఎక్కడికి వచ్చింది.

కొన్ని కాలనీల్లో మేము చొరవ తీసుకుని ఉచిత మంచి నీరు అందిస్తున్నప్పటికీ సమస్యకు శాశ్వత పరిష్కారం ఈ ప్రభుత్వం చూపడం లేదు, బల్క్ వాటర్ కనెక్షన్లు ఉన్నప్పటికీ ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

కార్పొరేట్ సంస్థలకు నీటిని కేటాయించడంపై ఉన్న శ్రద్ధ.. సామాన్య ప్రజలపై బాబుకు లేదు. వచ్చే ఆదివారం లోపు ఈ సమస్యను పరిష్కారం చేయాలి లేదంటే జీవీఎంసీ కార్యాలయాన్ని ముట్టడిస్తాం.

JAI RAM, MADURAWADA

JAI RAM, MADURAWADA