Anakapalli: అచ్యుతాపురంలో అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే సమీక్ష!

Anakapalli: అచ్యుతాపురం సర్వసభ్య సమావేశంలో ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అభివృద్ధి పనులపై సమీక్షించారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI
Published on: 7 Sept 2026 4:06 PM IST
Anakapalli
X

Anakapalli: అచ్యుతాపురంలో అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే సమీక్ష!

అనకాపల్లి జిల్లా: ఎలమంచిలి నియోజకవర్గం, అచ్యుతాపురం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఎలమంచిలి నియోజకవర్గ ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, తాగునీటి సరఫరా, రహదారులు, విద్య, వైద్యం, పారిశుద్ధ్యం తదితర అంశాలపై అధికారులతో సమగ్రంగా సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ మాట్లాడుతూ, ఎలమంచిలి నియోజకవర్గానికి గోదావరి జలాలు అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో భూగర్భ జలాలను వృథా చేయకుండా ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

పూడిమడక గ్రామంలో హెల్త్ సెంటర్ మంజూరైన నేపథ్యంలో వెంటనే అనువైన స్థలాన్ని పరిశీలించాలని తహసీల్దార్‌ను ఆదేశించారు. అలాగే సీఎస్‌ఆర్ నిధులను సద్వినియోగం చేసుకుని పశువుల షెడ్ల నిర్మాణానికి వినియోగించాలని అధికారులకు సూచించారు.

ప్రజల సమస్యల పట్ల అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ప్రజల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదుపై సత్వరమే స్పందించాలి అని తెలిపారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI

NAGA SRINIVASARAO, ANAKAPALLI

Next Story