Visakhapatnam: సూపర్‌ సిక్స్ హామీల అమలులో కూటమి ప్రభుత్వం విఫలం!

Visakhapatnam: కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలను విస్మరించి మహిళలను మోసం చేస్తోందని మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి విమర్శించారు.

A.SANTHOSH KUMAR, PATHAPATNAM
Published on: 31 July 2026 1:05 PM IST
Visakhapatnam
X

Visakhapatnam: సూపర్‌ సిక్స్ హామీల అమలులో కూటమి ప్రభుత్వం విఫలం!

Visakhapatnam: కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన 'సూపర్ సిక్స్' హామీలను విస్మరించి మహిళలను, నిరుద్యోగులను దారుణంగా మోసం చేస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు, మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి విమర్శించారు. కూటమి నాయకులు అధికారంలోకి రాకముందు 18 నుంచి 59 ఏళ్ల వయస్సున్న ప్రతి మహిళకు 'ఆడబిడ్డ నిధి' కింద నెలకు రూ. 1,500 ఇస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు దాన్ని అమలు చేయకుండా తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని దుయ్యబట్టారు.

ఆడబిడ్డ నిధి తో పాటు తల్లికి వందనం, ఇతర 'సూపర్ సిక్స్' పథకాల అమలును బడ్జెట్ సాకులు చూపుతూ కాలయాపన చేయడం కూటమి ప్రభుత్వ నైజానికి నిదర్శనం. మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు ఇచ్చిన హామీలను అధికారంలోకి రాగానే మర్చిపోయారు.

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మాజీ సీఎం శ్రీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మహిళల ఆర్థిక, సామాజిక సాధికారతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. అమ్మఒడి, వైఎస్సార్ ఆసరా, ఈబీసీ నేస్తం, కాపు నేస్తం, సున్నా వడ్డీ, వైఎస్సార్ చేయూత వంటి అనేక సంక్షేమ పథకాలను పక్కా క్యాలెండర్ ద్వారా నిర్దేశిత తేదీల్లోనే నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసిన ఘనత జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుంది. కరోనా వంటి కష్టకాలంలో కూడా సంక్షేమ పథకాల అమల్లో ఎలాంటి కోతలు విధించకుండా జగన్ చెప్పిన మాట ప్రకారం ప్రతి మహిళకూ అండగా నిలిచారు.

చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికైనా మాట వరుస హామీలతో కాలం వెళ్లదీయడం మాని, ఆడబిడ్డ నిధి సహా ఇచ్చిన ప్రతి హామీని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

A.SANTHOSH KUMAR, PATHAPATNAM

A.SANTHOSH KUMAR, PATHAPATNAM

Next Story