VR Puram: చంద్రబాబు నిర్బంధానికి మూడేళ్లు - కొవ్వొత్తుల ప్రదర్శన
VR Puram: విఆర్ పురంలో చంద్రబాబు 53 రోజుల నిర్బంధానికి వ్యతిరేకంగా టీడీపీ మండల అధ్యక్షుడు బొర్రా నరేష్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన.
VR Puram: చంద్రబాబు నిర్బంధానికి మూడేళ్లు - కొవ్వొత్తుల ప్రదర్శన
విఆర్ పురం: చంద్రబాబును అక్రమ కేసులతో 53 రోజులు నిర్బంధించడం వైయస్ఆర్సీపీ ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనమని విఆర్ పురం టిడిపి మండల అధ్యక్షుడు బొర్రా నరేష్ అన్నారు.ప్రజాసేవే పరమావధి గా భావించే చంద్రబాబు నాయుడుని అక్రమ కేసులతో అరెస్టు చేసి 53 రోజులపాటు నిర్బంధించడంతో రాష్ట్రం తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు స్వచ్ఛందంగా నిజం గెలవాలి అంటూ చంద్రబాబుకు మద్దతుగా నిలిచారని అన్నారు.
ప్రజల నుంచి లభించిన మద్దతుతో చంద్రబాబు పై ఉన్న విశ్వాసం రెట్టింపు అయిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు,జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు,రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, నియోజకవర్గ శాసన సభ్యురాలు మిరియాల శిరీష దేవి ఆదేశాల మేరకు ఈరోజు మండల అధ్యక్షులు బోర్ర నరేష్ కుమార్ ఆధ్వర్యంలో మండలంలో కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు.
రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజల అభ్యుదయమే ధ్యేయంగా ప్రజలనే దేవుళ్ళుగా భావించే ఒక మంచి వ్యక్తిని నిర్బంధించిన హేయమైన చర్యగా అభివర్ణించారు..గోడ్డలి పార్టీకి ప్రజలు బాగా బుద్ధి చెప్పారు అని నిజం గెలిచింది అని అన్నారు. చంద్రబాబునాయుడు ని చీకటిలో నిర్బంధించిన ఈ రోజునే రాష్ట్రమంతా వెలుగులతో వెల్లివిరియాలనే లక్ష్యంతో వి ఆర్ పురం మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సంఘీభావంగా 53 కొవ్వొత్తులతో ఎన్టీఆర్ విగ్రహం వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జ్ వాళ్ళ రంగారెడ్డి గారు, ముత్యాల రామారావు , యూనిటీ ఇన్చార్జులు బొర్రా నరసింహారావు ,బీరకా ప్రకాష్ రావు ,ముత్యాల చంద్రశేఖర్ , ఐటీడీపీ మండల కన్వీనర్ ఆకోజు భాగ్యలక్ష్మి,mptc భాగ్యలక్ష్మి, సూరి, ముత్యాలరావు, రేపు సింహాచలం,సత్యనారాయణ, పులి సాహెబ,రంగాచారి,రాజేష్, మడకం రాజు, భూమయ్య,, బ్రహ్మయ్య, భాను, వెంకన్న, GV, దుర్గారావు, శివ, అప్పన్న బాబు తదితరులు పాల్గొన్నారు.




