VR Puram: బెల్ట్ షాపుల ద్వారా మద్యం అమ్మకాలు ఆపాలి

VR Puram: వీఆర్ పురం మండలంలో గిరిజన గ్రామాల్లో బెల్ట్ షాపుల ద్వారా జరుగుతున్న మద్యం అమ్మకాలను తక్షణమే అడ్డుకోవాలని, లేదంటే ఆందోళన చేపడతామని ఐద్వా హెచ్చరించింది.

RAJESH REDDY, CHINTOOR
Published on: 9 Sept 2026 6:37 PM IST
VR Puram
X

VR Puram: బెల్ట్ షాపుల ద్వారా మద్యం అమ్మకాలు ఆపాలి

విఆర్ పురం: రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన లైసెన్స్ షాపుల్లో కాకుండా ఆదివాసి గిరిజన గ్రామాల్లో విచ్చలవిడిగా బెల్ట్ షాపుల ద్వారా మద్యం అమ్మకాలు నిర్వహిస్తున్నారని గ్రామాల్లో యువత మద్యం మత్తులో ఉంటున్నారని తక్షణమే ఎక్సైజ్ శాఖ చర్యలు తీసుకోవాలి లేదంటే బెల్ట్ షాపుల ద్వారా అమ్ముతున్న మద్యం అమ్మకాలను ఐద్వా (మహిళా సంఘం) ఆధ్వర్యంలో అడ్డుకుంటామని ఆ సంఘం అధ్యక్ష కార్యదర్శులు ఎంపీపీ కారం లక్ష్మి, సోడి రమాదేవి లో హెచ్చరించారు.

గ్రామ గ్రామాన బడి ఉండాలని అనేకమంది మేధావులు కోరుకుంటారు కానీ ప్రతి గ్రామంలో బడి లేకపోయినా మద్యం షాపులు మాత్రం విచ్చలవిడిగా దర్శనమిస్తున్నాయని దీనివలన తల్లిదండ్రులకు చేతికి సహాయం చేయవలసిన యువత మద్యానికి అలవాటు పడి వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని అన్నారు.

ఇది మద్యం ఎక్సైజ్ మరియు పాలకుల నిర్లక్ష్యం వల్లే జరుగుతుందని ఈ దేశానికి భావి భారతం పౌరులుగా ఎదగాల్సినటువంటి యువతను మద్యానికి బానిసలుగా ఈ పాలకులు తయారు చేస్తున్నారని పేర్కొన్నారు.అంతేకాకుండా పొలాల్లో పచ్చని పంట ఉండాల్సిన చోట బీరు సీసాలు దర్శనమిస్తున్నాయని, రైతు పాదాలు తెగిపోయి రైతు కంటనీరు పెడుతున్నాడని తక్షణమే బెల్ట్ షాపులను ఎక్సైజ్ శాఖ అధికారులు అడ్డుకోకపోతే ఐద్వా ఆధ్వర్యంలో అడ్డుకుంటామని హెచ్చరిక చేశారు.

RAJESH REDDY, CHINTOOR

RAJESH REDDY, CHINTOOR

Next Story